IND vs ENG: మళ్లీ టాస్ ఓడిన ఇండియా... ఇంగ్లాండ్ బౌలింగ్!

ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఐదో టెస్టులో  టీమిండియా మళ్లీ టాస్ ఓడింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో  ఇండియా బ్యాటింగ్ చేయనుంది. ఈ  సిరీస్ లో ఇండియా ఒక్కసారి కూడా టాస్ గెలవకపోవడం గమనార్హం.

New Update
ind vs eng

IND vs ENG: ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఐదో టెస్టులో  టీమిండియా మళ్లీ టాస్ ఓడింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో  ఇండియా బ్యాటింగ్ చేయనుంది. ఈ  సిరీస్ లో ఇండియా ఒక్కసారి కూడా టాస్ గెలవకపోవడం గమనార్హం. ఇది అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత్ కు వరుసగా 15వ టాస్ ఓటమి. ఇక ప్రస్తుతం టీమిండియా 2-1తో వెనుకబడి ఉంది. భుజం గాయం కారణంగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్  ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు, అతని స్థానంలో ఒల్లీ పోప్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. 

ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేయాలని టీమిండియా భావిస్తుంటే ఇందులో గెలిచి సిరీస్ దక్కించురకోవాలని ఇంగ్లాండ్ ప్లాన్ లో ఉంది. మొత్తానికి ఈ మ్యాచ్ డ్రా అయిన ఓడిపోయిన భారత్ మాత్రం సిరీస్ కోల్పోవాల్సి ఉంటుంది. సో ఇది ఇండియాకు డూ అర్ డై మ్యాచ్ అన్నమాట. భారత్ తుది జట్టులో నాలుగు మార్పులు చేసింది . అన్షుల్ కాంబోజ్ స్థానంలో ఆకాష్ దీప్ ,  పంత్, శార్దూల్, బుమ్రా స్థానంలో జురెల్, కరుణ్, ప్రసిద్ధ్ లను తుదిజట్టులోకి  తీసుకున్నారు. 


జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్ ), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్( వికెట్ కీపర్ ), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జామీ ఓవర్టన్, జోష్ టంగ్యూ

ఇంగ్గాండ్ జట్టులో కూడా మార్పులు 

ఇంగ్లాండ్ కూడా తుది జట్టులో మార్పులు చేసింది. మాంచెస్టర్‌లో సెంచరీ ఐదు వికెట్ల పడగొట్టడంతో అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన ఇచ్చిన స్టోక్స్ కుడి భుజం గాయం కారణంగా అందుబాటులో లేడు. ఐదో టెస్టుకు పోప్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అతనికి ఇది ఐదో  టెస్టు కెప్టెన్సీ కావడం విశేషం. బెన్ స్టోక్స్ తో పాటుగా ఆర్చర్,  కార్స్, డాసన్ లను తప్పించి, జాకబ్ బెథెల్, గస్ అట్కిన్సన్, జామీ ఓవర్టన్, జోష్ టంగ్‌లను జట్టులోకి తీసుకున్నారు.  ఇక ఈ మ్యాచ్ లో  మొదటి రెండు రోజులు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది, ఇది మ్యాచ్‌పై ప్రభావం చూపవచ్చు. ఇప్పటికే వర్షం కారణంగా కవర్స్ వేయడం, తీయడం జరుగుతోంది. పిచ్‌పై 8 మి.మీ. గడ్డి ఉంది. ఉదయం వర్షం కురవడంతో ఓవర్‌కాస్ట్ పరిస్థితులు ఉన్నాయి. 

Also Read :   John Hastings : ఒకే ఓవర్‌లో 18 బంతులు.. ఆసీస్ పేసర్ అత్యంత చెత్త ఓవర్

Advertisment
తాజా కథనాలు