/rtv/media/media_files/2024/11/05/S2VDyKLPZgTp7m40vKOo.jpg)
చాలా ఇంపార్టెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఇంగ్లాండ్ తో మ్యాచ్ లు ఆడుతోంది భారత క్రికెట్ జట్టు. ప్రతీ మ్యాచ్ గెలవడం కీలకం. దానికి తగ్గట్టే విజయాల పరంపరతో దూసుకుపోతోంది. ఇప్పటికే టీ20 సీరీస్ ను కైవసం చేసుకుంది. ఇప్పుడు జరుగుతున్న వన్డే సీరీస్ లో కూడా మొదటి మ్యాచ్ ను అదరగొట్టింది. ఇదే ఊపుతూ ఈరోజు కటక్ లో జరిగే రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. వరుస ఫెల్యూర్స్ తో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ప్రతీ మ్యాచ్ ను ప్రెస్టీజ్గా తీసుకుంటున్నాడు. మొదటి వన్డేలో గెలిచినా..రెండో దానిలో కూడా విజయం సాధించి సీరీస్ ను దక్కించుకోవాలని అనుకుంటున్నాడు.
విరాట్ కోహ్లీ ఎంట్రీ..
కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ...ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సీరీస్ లో ఘోరంగా విఫలమైంది ఈ జంట. తరువాత ఆడిన రంజీల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో ఈ స్టార్ ఆటగాళ్ళు ఇంక రిటైర్ అయిపోవచ్చననే కామెంట్స్ తెగ వినిపిస్తున్నాయి. దానికి తోడు ఛాంపియన్స్ ట్రోఫీని ఎలా అయినా గెలవాల్సి పరిస్థితి. లేకపోతే టీమ్ ఇండియా పరువు అడ్డంగా పోతుంది. దీంతో కెప్టెన్ రోహిత్, విరాట్ ఇద్దరూ ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సీరీస్ లను చాలా సీరియస్గా తీసుకున్నారు. మొదటి మ్యాచ్ లో కింగ్ కోహ్లీ ఆడలేదు. అయితే ఇప్పుడు రెండో మ్యాచ్ కు మాత్రం అతను బరిలోకి దిగుతున్నాడు. దీంతో అందరి దృష్టీ ఇప్పుడు అతని మీదనే ఉంది. రోహిత్ మొదటి మ్యాచ్ ఆడాడు కానీ..ెప్పటిలా కేవలం రెండు పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. జట్టు గెలుస్తుందని టీమ్ ఇండియా అభిమానులు నమ్మకంగానే ఉన్నా...ఈ స్టార్ ఆటగాళ్ళు ఎలా ఆడతారనే దానిపై మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈరోజైనా ఇంగ్లాండ్ ఆడుతుందా..
మరోవైపు ఇంగ్లాండ్ జట్టు కమ్ బ్యాక్ అవ్వాలని అనుకుంటోంది. ఇప్పటివరకు ప్రతీ మ్యాచ్ ఓడిపోవడం...ఆ జట్టును కృంగదీస్తోంది. బ్యాటర్లు, బౌలర్లు బాగానే ఆడుతున్నప్పటికీ గెలుపు మాత్రం వరించడం లేదు. టీ20 ఎలానో పోయింది...కనీసం వన్టే సీరీస్ అను అయినా దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. మొదటి వన్టే కూడా చేజారిపోయింది...దాంతో ఇప్పుడు రెండో వన్డే మీద దృష్టి పెట్టింది. సాల్ట్, డకెట్, బ్రూక్, రూట్, బట్లర్, లివింగ్‌స్టన్, బెతెల్..ిలా అందరూ పెద్ద బ్యాటర్లే ఉన్నారు..అయితే వాళ్ళు పెర్ఫామెన్స్ చేయడం పైనే విజయం ఆధారపడి ఉంది. ఇక బౌలింగ్‌లో స్పిన్నర్ అడిల్ రషీద్ తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. పిచ్ స్పిన్‌కు కాస్త సహకరించనున్న నేపథ్యంలో పార్ట్ టైమర్లు బెతెల్, లివింగ్‌స్టన్ కూడా కీలకం కానున్నారు. పేసర్లు ఆర్చర్, కార్స్, సకిబ్ మహమూద్‌లు నిలకడా బౌలింగ్ చేయాలి.
పిచ్..
కట్క్ లోని బారాబటి స్టేడియం బ్యాటింగ్ అనుకూలమైన పిచ్. అలాగే రెండో ఇన్నింగ్సలో స్పిన్నర్లు ప్రభావం చూపించొచ్చు. చివరగా 2019లో ఇక్కడ జరిగిన వన్డేలో భారత్.. వెస్టిండీస్‌పై 316 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. ఆ మ్యాచ్‌లో కోహ్లి 85 పరుగుల ఇన్నింగ్స్‌తో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.