Cricket: చేతులెత్తేసిన టీమ్ ఇండియా..మూడో టీ20లో ఇంగ్లాండ్ విజయం

వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచారు. మూడోది కూడా గెలిస్తే సీరీస్ మనదే అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ టీమ్ అలా జరగనివ్వలేదు. మూడో టీ20లో గెలిచి...సీరీస్ పై ఆశలను సజీవం చేసుకుంది. 

author-image
By Manogna alamuru
New Update
cricket

England Vs India 3rd T20 Match

 ఇంగ్లాండ్, ఇండియా ఐదు టీ20 మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా ఈ రోజు రాజ్ కోట్లో మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో టీమ్ ఇండియాను ఓడించింది. మొదటి బ్యాటింగ్ చేసిన బ్రిటీష్ టీమ్ 172 పరుగుల లక్ష్యాన్ని భారత్ కు ఇచ్చింది.  రెండో ఇన్నింగ్స్ లో లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా తడబడింది. వేగంగా వికెట్లను కోల్పోయింది. హార్దిక్ పాండ్యా 40 పరుగులతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అభిషేక్‌ శర్మ (24), సూర్య (14), తిలక్‌ వర్మ (18), అక్షర్‌ పటేల్‌ (15) పెద్దగా రాణించలేదు. మరవైపు ఇంగ్లాండ్ బౌల్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఓవర్టన్ 3 వికెట్లు, ఆర్చర్, కార్సేలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.  దీంతో టీమ్ ఇండియా 145 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను ఓడిపోయింది.  ఈ హ్యాచ్ అయిన తర్వాత సీరీస్ లో 2-1 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. 

చెలరేగిన వరుణ్...

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ సమిష్టిగా రాణించింది.  ఓపెనర్ బెన్ డెట్ 28బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇతని తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ లివింగ్ స్టన్ 24 బంతుల్లో 43 పరుగులతో దూకుడుగా ఆడాడు.  జోస్ బట్లర్ కూడ 24 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ టీమ్ 171 పరుగుల లక్ష్యాన్ని భారత్ కు ఇవ్వగలిగింది. మరవైపు భారత బౌలర్లలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 24 పరుగులకు 5 వికెట్లు తీసి చెలరేగాడు. అయితే మిగతా బౌలర్లు ఎక్కువ పరుగుల ఇచ్చుకోవడంతో ఇంగ్లాండ్ భారీ లక్ష్యాన్ని ఇవ్వగలిగింది. రవి బిష్ణోయ్ 4 ఓవర్లలో ఏకంగా 46 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ మాత్రమే తీశాడు. హార్దిక్ పాండ్యా 2, అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు. 

Also Read: HYD: మేడ్చల్ యవతి హత్య నిందితుడిని పట్టిచ్చిన కండోమ్
 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు