Cricket: మూడో మ్యాచ్ లోనూ విజయం..ఇంగ్లాండ్ తో వన్డే సీరీస్ క్లీన్ స్వీప్

ఇంగ్లాండ్  జరిగిన మూడో వన్డేలో కూటా టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 142 పరుగుల తేడాతో ఇంగ్లీష్ టీమ్ ను చితక్కొట్టేసింది. దీంతో వన్డే సీరీస్ ను క్లీన్ స్వీప్ చేసినట్టయింది.

New Update
cric

India claen sweap the ODI series with England

ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సీరీస్ లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లో టీమ్ ఇండియా మూడో మ్యాచ్ ను ఆడింది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి సీరీస్ ను సొంతం చేసుకున్న భారత జట్టు ఇప్పుడు మూడో మ్యాచ్ లో కూడా నెగ్గి క్లీన్ స్వీప్ చేసేసింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఒక్క మ్యాచ్ ను కూడా నెగ్గకుండా కట్టడి చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు జరిగిన ఈ వన్డే సీరీస్ లో అన్ని మ్యాచ్ లూ గెలవడం...భారత్ కు కలిసి వచ్చే అంశం. 

ఇక ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే భారత కీలక బ్యాటర్లు అందరూ సమిష్టిగా రాణించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది. శుభ మన్ గిల్ అయితే చాలా రోజుల తర్వాత సెంచరీ చేశాడు. 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్ లతో 112 పరుగులు చేశాడు.  తరువాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టులో మొదట్లో బాగా ఆడినా తర్వాత చేతులెత్తేసింది. దీంతో బ్రిటీష్ జట్టు 34.2 ఓవర్లలో 214 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. టామ్ బాంటన్ (38), అట్కిన్సన్ (38; 19 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్లు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (23), బెన్ డకెట్ (34) మాత్రమే కాస్త చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్‌కు తలో వికెట్ వచ్చింది. 

ప్లేయర్ ఆఫ్ ద  సీరీస్ గిల్..

ఈ మ్యాచ్ లో అంతా బ్యాటర్లదే హవా. గిల్ సెంచీకి తోడు శ్రేయస్ అయ్యర్  64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 78 పరుగులు చేయగా.. కొంతకాలంగా విఫలమవుతున్న విరాట్ కోహ్లీ కూడా 55 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్ లతో 52 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చేశాడు. అలాగే కే ఎల్ రాహుల్ 29 బంతుల్లో 40 పరుగులు చేశాడు. కానీ కెప్టెన్ రోహిత్ మాత్రం ఈసారి నిరాశ పర్చాడు. కేవలం ఒక్క పరుగుకే అవుట్ అయిపోయాడు. ఈ సిరీస్‌లో అదరగొట్టిన శుభ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. గిల్ తొలి వన్డేలో 87, రెండో వన్డేలో 60 పరుగులు చేశాడు. మూడో మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా శుభ్ మన్ గిల్ నే వరించింది. 

ఇది కూడా చదవండి: Bird flu: పెరిగిన బర్డ్ ఫ్లూ.. ఒక్కరోజే 40 లక్షల కోళ్లు ఖతం.. చికెన్ సెంటర్లకు రూ. 25వేల జరిమానా!


 

 

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు