IND VS AUS: మూడో సిరీస్.. టీమిండియా, ఆసీస్‌ జట్లలో భారీ మార్పులు - స్టార్ బౌలర్ ఔట్

భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా ఇప్పటికి రెండు మ్యాచ్‌లు జరగ్గా.. అందులో ఫస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో మ్యాచ్‌ మెల్ బోర్న్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌ను ఆసీస్ కైవసం చేసుకుంది. ఇందులో భారత్ అత్యంత ఘోరంగా ఆడింది.

New Update
IND Vs AUS 3rd T20 Series

IND Vs AUS 3rd T20 Series

IND Vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌ జరుగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇప్పటికి రెండు మ్యాచ్‌లు జరగ్గా.. అందులో ఫస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో మ్యాచ్‌ మెల్ బోర్న్ వేదికగా జరిగింది.

ఈ మ్యాచ్‌ను ఆసీస్ కైవసం చేసుకుంది. ఇందులో భారత్ అత్యంత ఘోరంగా ఆడింది. ఒక్క అభిషేక్ తప్పించి మిగతా స్టార్ బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. దీంతో భారత్ బ్యాటింగ్‌పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. 

IND Vs AUS 3rd T20 Series

ఇక ఇవాళ ఈ సిరీస్‌లోని మూడో మ్యాచ్ హౌబర్ట్‌లో జరగబోతుంది. ఈ మ్యాచ్‌లో గెలిపొంది విమర్శలకు చెక్ పెట్టాలని టీమిండియా చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లలో మార్పులు చేర్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది. గత మ్యాచ్ మెల్‌బోర్న్‌లో భారత బ్యాటింగ్‌ను గడగడలాడించిన ఆసీస్ స్టార్ బౌలర్ హేజిల్‌వుడ్  ఈ మూడో మ్యాచ్‌కు దూరం అయినట్లు సమాచారం. 

యాషెస్ సన్నాహాల కారణంగా హేజిల్‌వుడ్ హోబర్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్‌లో జరిగే మూడవ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. గత మ్యాచ్‌లో హేజిల్‌వుడ్ మూడు వికెట్లు పడగొట్టి భారత్ జట్టుకు గట్టి షాక్ ఇచ్చాడు. అతడి బౌలింగ్‌‌ను తట్టుకోవడం భారత్ బ్యాటర్లకు అత్యంత కష్టంగా మారింది. లైన్ అండ్ లెంగ్త్‌, బౌన్స్‌తో బ్యాటర్లకు చెమటలు పట్టించాడు. ఇలా సూర్య కుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్, తిలక్ వర్మ వంటి ప్లేయర్లను పెవిలియన్‌కు పంపించాడు. అలాంటి ప్లేయర్ ఇప్పుడు ఈ మూడో మ్యాచ్‌కు దూరం కావడం భారత జట్టుకు కాస్త ఉపశమనం అనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో అతడి స్థానంలో సీన్ అబాట్ వచ్చే అవకాశం ఉంది. 

Also Read :  బాబర్ ఆజామ్ సంచలనం: రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు బద్దలు

అలాగే భారత్ జట్టులో కూడా భారీ మార్పులు చేర్పులు జరిగాయి. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్, బ్యాటర్ సంజు సామ్‌సన్‌ను పక్కన పెట్టి అతడి ప్లేస్‌లో జితేష్ శర్మకు అవకాశం కల్పించారు. అదే సమయంలో బౌలర్ హర్షిత్ రాణా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టి ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్ సింగ్‌కు అవకాశం కల్పించారు.

భారత 11 మంది ఆటగాళ్లు:  అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష దీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా 11 మంది ఆటగాళ్లు: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, ఎం. షార్ట్, నాథన్ ఎల్లిస్, జేవియర్ బార్ట్‌లెట్, మాథ్యూ కుహ్నెమాన్, సీన్ అబాట్.

Advertisment
తాజా కథనాలు