/rtv/media/media_files/2025/10/27/ind-vs-aus-t20-series-2025-10-27-07-47-59.jpg)
IND Vs AUS T20 Series
భారత్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్(ind-vs-aus-t20-series) కోసం సిద్ధంగా ఉంది. ఇటీవలే వన్డే సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లు జరగ్గా.. భారత్ 1-2తో సిరీస్‌ను కోల్పోయింది. ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లను ఓడిపోయిన భారత్.. మూడో, చివరి మ్యాచ్‌ను గెలుపొందింది. ఈ చివరి మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దుమ్ము దులిపేశారు. రోహిత్ 121* పరుగులు.. విరాట్ 74* పరుగులు చేసి భారత్‌కు విజయాన్నందించారు.
Also Read : జట్టు బయటే ఉంచుతా.. హర్షిత్ రాణాకు గంభీర్ మాస్ వార్నింగ్
IND Vs AUS T20 Series
ఇక ఇప్పుడు అందరి చూపు టీ20 సిరీస్ పైనే పడింది. ఈ ఉత్కంఠభరితమైన సిరీస్ కోసం అభిమానులు, క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టీ20 సిరీస్‌లో మొత్తం 5 మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో మొదటి మ్యాచ్ అక్టోబర్ 29 నుంచి ప్రారంభం కానుంది. అయితే వన్డే సిరీస్‌తో పోలిస్తే.. టీ20 సిరీస్ కోసం భారత్ జట్టు పూర్తిగా మారనుంది.
టీమిండియా వన్డే జట్టులో పాల్గొన్న ఆరుగురు బడా ప్లేయర్లు.. ఇప్పుడు టీ20 సిరీస్ కోసం దూరమయ్యారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ప్లేయర్లు త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌లో కనిపించరు. సెలక్టర్లు ఈ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చారు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ T20I ఫార్మాట్ నుండి ఇప్పటికే రిటైర్ అయిన విషయం తెలిసిందే. కాగా భారత్ టీ20 సిరీస్‌కు స్టార్ అండ్ యంగ్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ వహించనుండగా.. శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు.
India’s squads for the upcoming bilateral series comprising three ODIs and five T20Is against Australia in October-November have been announced
— ANI (@ANI) October 4, 2025
India’s ODI squad: Shubman Gill (Captain), Rohit Sharma, Virat Kohli, Shreyas Iyer (VC), Axar Patel, KL Rahul (WK), Nitish Kumar… pic.twitter.com/4IAKTxig1J
Also Read : RO-KO: మూడో వన్డేలో రో-కోలు నెలకొల్పిన రికార్డులివే..
భారత్ టీ20 సిరీస్ జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ సంకేత్ రావ్, హర్షిత్ సంకేత్ రవ్, వాషింగ్టన్ సుందర్.
IND vs AUS T20 Schedule
| మ్యాచ్ సంఖ్య | తేదీ | వేదిక (స్టేడియం) | సమయం (IST) |
| 1వ T20I | అక్టోబర్ 29, 2025 (బుధవారం) | మానుకా ఓవల్, కాన్బెర్రా | మధ్యాహ్నం 1:45 PM |
| 2వ T20I | అక్టోబర్ 31, 2025 (శుక్రవారం) | మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్‌బోర్న్ | మధ్యాహ్నం 1:45 PM |
| 3వ T20I | నవంబర్ 2, 2025 (ఆదివారం) | బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్ | మధ్యాహ్నం 1:45 PM |
| 4వ T20I | నవంబర్ 6, 2025 (గురువారం) | బిల్ పిప్పెన్ ఓవల్, గోల్డ్ కోస్ట్ | మధ్యాహ్నం 1:45 PM |
| 5వ T20I | నవంబర్ 8, 2025 (శనివారం) | ది గబ్బా, బ్రిస్బేన్ | మధ్యాహ్నం 1:45 PM |
Follow Us