IND Vs AUS: ఫైనల్ మ్యాచ్ రద్దు.. టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భారత్

ఆస్ట్రేలియాతో జరిగిన 5 టీ20 సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య జరగాల్చిన చివరి టీ20 వర్షం కారణంగా రద్దయింది. దీంతో 2-1తో ముందజలోఉన్న భారత్‌ సిరీస్ సొంతం చేసుకుంది. మొత్తం 5 మ్యాచ్‌ల్లో 3 మాత్రమే జరగగా 2 వర్షం వల్ల క్యాన్సిల్ అయ్యాయి.

New Update
team india won the t20 Series against australia

team india won the t20 Series against australia

ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య జరగాల్చిన చివరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 2-1తో ముందజలో ఉన్న భారత్‌ సిరీస్‌ను సొంతం చేసుకుంది. మొత్తం 5 మ్యాచ్‌ల్లో 3 మాత్రమే జరగగా 2 వర్షం వల్ల క్యాన్సిల్ అయ్యాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. 4.5 ఓవర్లలో ఆట నిలిపి వేసే సమయానికి భారత్ స్కోరు 52/0గా ఉంది. అభిషేక్ (23), శుభ్‌మన్ (29) పరుగులతో క్రీజులో ఉన్నారు. 

India win the series 2-1

ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ వర్షం కారణంగా క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరు జట్లూ చెరో మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేశాయి. ఈ నేపథ్యంలో కీలకమైన నాల్గవ టీ20 మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టేసింది. 

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో 48 పరుగుల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించి.. సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఇవాళ గబ్బా వేదికగా ఐదో, చివరి టీ20 మ్యాచ్ జరగ్గా.. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది.

దీంతో భారత్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఇద్దరూ పరుగుల వర్షం కురిపించారు. కానీ వరుణుడు ఆసీస్ పాలిట శాపంలా మారడంతో భారత్ 2-1 ఆధిక్యంతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 

Advertisment
తాజా కథనాలు