AUS vs IND: భారత్‌తో మూడో వన్డే.. 236 పరుగులకు ఆసీస్‌ ఆలౌట్

భారత్‌తో జరుగుతోన్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారులు 46.4 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌట్ అయ్యారు.మ్యాట్ రెన్షా 56 పరుగులు సాధించాడు. మిచెల్ మార్ష్ (41), మాథ్యూ షార్ట్ (30) రాణించారు.

New Update
ind vs aus

AUS vs IND: భారత్‌తో జరుగుతోన్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారులు 46.4 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌట్ అయ్యారు.మ్యాట్ రెన్షా 56 పరుగులు (58 బంతుల్లో) చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. మిచెల్ మార్ష్ (41), మాథ్యూ షార్ట్ (30) రాణించారు.

భారత బౌలర్లతో హర్షిత్ రానా 4, వాసిగ్టంన్ 2, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.  1986 తర్వాత ఇలా ఆసీస్‌పై ప్రతి బౌలరూ వికెట్‌ తీయడం ఇదే తొలిసారి.  ఇక  ఈ మ్యాచ్ లో నాథన్ ఎల్లిస్ క్యాచ్ తో  రోహిత్ శర్మ  అరుదైన రికార్డు సృష్టించాడు. వన్డే కెరీర్‌లో అతనికిది100వది. భారత్ తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన జాబితాలో అతను సౌరవ్ గంగూలీ (99)ను అధిగమించాడు.

భారత్ తరపున ఫీల్డర్‌గా 100+ క్యాచ్‌లు (ODI)

163 V కోహ్లీ
156 M అజారుద్దీన్
140 S టెండూల్కర్
124 R ద్రావిడ్
102 S రైనా
100 రోహిత్ శర్మ *

మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే 2-0 ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ చివరి మ్యాచ్‌లో భారత్ పరువు కోసం, ఆస్ట్రేలియా వైట్‌వాష్ కోసం ఆడుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు