/rtv/media/media_files/2025/11/05/morne-morkel-explains-rotation-call-on-arshdeep-singh-2025-11-05-15-55-00.jpg)
Morne Morkel explains rotation call on Arshdeep Singh
అంతర్జాతీయ T20లలో భారతదేశం తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఏకైక బౌలర్. డెత్ ఓవర్లలో తన మ్యాజిక్ బౌలింగ్‌తో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కూడా అతను నిష్ణాతుడు. అతడు మరెవరో కాదు.. లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్. అవును.. అతడు ఎన్నో మ్యాచ్‌లను తన ఒంటి చేత్తో గెలిపించాడు. ఎంతో అనుభవైజ్ఞుడైన అతడు ఎన్నో రికార్డులు బ్రేక్ చేసినప్పటికీ.. పదేపదే ప్లేయింగ్ ఎలెవెన్ నుండి తప్పించారు.
అందుకే అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టాం
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో T20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో కూడా అర్ష్‌దీప్‌కు ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కలేదు. దీంతో టీమిండియా బౌలింగ్ కోచ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అద్భుతమైన ఆట ప్రదర్శన చేస్తున్నప్పటికీ అర్ష్‌దీప్‌కు అన్యాయం జరుగుతుందని అభిమానులు, క్రికెట్ ప్రియులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు.
"Bigger picture in mind": Morne Morkel explains rotation call on Arshdeep Singh during T20I series against Australia
— ANI Digital (@ani_digital) November 5, 2025
Read @ANI Story | https://t.co/ql6Fa4ic7Y#MorneMorkel#ArshdeepSingh#T20Ipic.twitter.com/11QuKDe9Bp
అనంతరం మూడవ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌కు అవకాశం లభించింది. ఆ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ తన బౌలింగ్ ప్రదర్శనతో అదరగొట్టేశాడు. ఆసీస్ స్టార్ బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చాడు. అయితే ఆస్ట్రేలియాతో నాల్గవ T20 మ్యాచ్‌కు ముందు
టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్న్ మోర్కెల్ మీడియాతో మాట్లాడారు. ఇందులో అర్ష్‌దీప్ అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చినప్పటికీ.. అతన్ని ఎందుకు పక్కన పెట్టాల్సివచ్చిందో ఆయన వివరించారు.
‘‘అర్ష్ దీప్ అనుభవజ్ఞుడైన బౌలర్.. అతడు ప్రపంచ స్థాయి బౌలర్ కూడా. పవర్‌ప్లేలో మాకు అత్యధిక వికెట్లు తీశాడు. మేము అతని విలువను అర్థం చేసుకున్నాము. అయితే, ఈ పర్యటనలో మిగిలిన కాంబినేషన్‌లను కూడా పరిగణనలోకి తీసుకోవడం మాకు చాలా ముఖ్యం. మేము విభిన్న కాంబినేషన్‌లపై పని చేస్తున్నామని అతను అర్థం చేసుకున్నాడు.
పవర్‌ప్లేలో ప్రముఖ వికెట్ టేకర్లలో అర్ష్‌దీప్ ఒకరని తెలుసు. అతను జట్టుకు ఎంత విలువైనవాడో మాకు అర్థమైంది. కానీ ఇతర ఎంపికలను కూడా అన్వేషించాలి. ఎప్పుడూ ఆటగాళ్ల సెలక్షన్లపై నిరాశ ఉంటుంది. కానీ కొన్ని సార్లు దాన్ని కంట్రోల్ చేయలేము. కష్టపడి శిక్షణ తీసుకోవాలని, అవకాశం వచ్చినపుడు సిద్ధంగా ఉండమని తరచూ ఆటగాళ్లకు చెబుతాం. త్వరలో ప్రపంచకప్ టోర్నీ ఉంది. అందువల్ల ఏ ప్లేయర్ ఎలా ఆడుతాడో అర్థం చేసుకోవడం మాకు చాలా ముఖ్యం. వేర్వేరు పరిస్థితుల్లో ప్లేయర్స్ ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారో అన్వేశిస్తున్నాం. అందుకే కొన్ని మ్యాచ్‌లలో ప్రయోగాలు చేయక తప్పడం లేదు.’’ అని బౌలింగ్ కోచ్ తెలిపారు.
Follow Us