Shreyas Iyer: ఐసీయూలో శ్రేయాస్‌ అయ్యర్.. తీవ్ర రక్తస్రావంతో అడ్మిట్..!

భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ హాస్పిటల్‌లో చేరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ సందర్భంగా పక్కటెముక గాయం కారణంగా అంతర్గత రక్తస్రావం కావడంతో సిడ్నీలోని ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం అతడు ICUలో ఉన్నాడు.

New Update
BREAKING

BREAKING

టీమిండియా(team-india)కు బిగ్ షాక్ తగిలింది. భారత వన్డే(IND Vs AUS ODI Series 2025) జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్(shreyas-iyer) హాస్పిటల్‌లో చేరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో పక్కటెముక గాయం కారణంగా అంతర్గత రక్తస్రావం కావడంతో  శ్రేయాస్ సిడ్నీలోని ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం అతడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉన్నాడు.

Also Read :  IND Vs AUS T20 Series: ఆసీస్‌తో T20 సిరీస్.. భారత్ నుంచి 6 మంది ప్లేయర్లు ఔట్

Shreyas Iyer In ICU

ఆసీస్ బ్యాటర్ అలెక్స్ కారీని అవుట్ చేయడానికి బ్యాక్‌వర్డ్ పాయింట్ నుండి వెనుకకు పరిగెత్తుతూ అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు అయ్యర్. ఈ ప్రక్రియలో అతని ఎడమ పక్కటెముకకు గాయమైనట్లు కనిపించాడు. శనివారం డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వచ్చిన వెంటనే టీం డాక్టర్, ఫిజియో ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా.. వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

Also Read :  RO-KO: మూడో వన్డేలో రో-కోలు నెలకొల్పిన రికార్డులివే..


శ్రేయాస్ హెల్త్ పై ఓ వ్యక్తి నేషనల్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘శ్రేయాస్ గత రెండు రోజులుగా ఐసియులో ఉన్నాడు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత.. అంతర్గత రక్తస్రావం అయినట్లు గుర్తించారు. రక్తస్రావం కారణంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి దాదాపు 2 నుంచి 7 రోజుల వరకు డాక్టర్ల పర్యావేక్షణలో ఉంటాడు’’ అని నేషనల్ మీడియాకు తెలిపారు.

మొదట్లో అయ్యర్ దాదాపు మూడు వారాల పాటు ఆటకు దూరంగా ఉంటారని భావించారు. కానీ గాయం పెద్దది కావడంతో ఇప్పుడు కోలుకునే కాలం ఎక్కువ కావచ్చని తెలుస్తోంది. క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం.. అంతర్గత రక్తస్రావం జరిగినందున, శ్రేయాస్ కోలుకోవడానికి ఖచ్చితంగా ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమయంలో అతను పోటీ క్రికెట్‌కు తిరిగి రావడానికి ఖచ్చితమైన సమయం చెప్పడం కష్టం.

Advertisment
తాజా కథనాలు