/rtv/media/media_files/2025/10/26/gautam-gambhir-warning-to-harshit-rana-2025-10-26-14-09-50.jpg)
gautam gambhir warning to harshit rana
టీమిండియా క్రికెటర్, బౌలర్ హర్షిత్ రాణాకు.. కోచ్ గౌతమ్ గంభీర్(gautam-gambhir) మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో, ఆఖరి మ్యాచ్(ind vs aus) కు ముందు హర్షిత్ ప్రదర్శనపై అసంతృప్తితో ఉన్న గంభీర్.. సరిగ్గా ఆడకపోతే.. జట్టులో కొనసాగడం సాధ్యం కాదని హర్షిత్ ను హెచ్చరించాడు. ఈ విషయాన్ని ఇప్పుడు హర్షిత్ కోచ్ ఒక మీడియా ఛానెల్ కు చెప్పడంతో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : RO-KO: మూడో వన్డేలో రో-కోలు నెలకొల్పిన రికార్డులివే..
Gambhir Warning To Harshit Rana
హర్షిత్ రాణా గత కొన్ని మ్యాచ్ ల నుంచి పెద్దగా పెర్ఫార్మ్ చేయడం లేదు. ఆసియా కప్ 2025 టోర్నీలోనూ ఆశించినంతగా బౌలింగ్ చేయలేకపోయాడు. దీంతో అతడిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా సరే హర్షిత్ పై నమ్మకంతో గంభీర్ ఆస్ట్రేలియాతో వన్డే జట్టులోకి తీసుకున్నాడు. దీంతో గంభీర్ పై కూడా విమర్శలు చెలరేగాయి. అనంతరం కోచ్ గంభీర్ మీడియా ముందుకొచ్చి విమర్శకులకు గట్టి సమాధానం చెప్పాడు.
ఇక ఆసీస్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా హర్షిత్ తొలి రెండు మ్యాచ్ ల్లో పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయాడు. పేవలమైన బౌలింగ్ ప్రదర్శించాడు. దీంతో గంభీర్ ఇక లాభం లేదనుకుని హర్షిత్ ను తీవ్రంగా హెచ్చరించాడు. ఇదే విషయాన్ని హర్షిత్ చిన్ననాటి కోచ్ శ్రవణ్ తెలిపారు.
ఆయన ప్రకారం.. హర్షిత్ రాణా మ్యాచ్ కు ముందు తనకు ఫోన్ చేశాడని చిన్ననాటి కోచ్ శ్రవణ్ తెలిపారు. తన ప్రదర్శనపై బయట వస్తున్న విమర్శలకు తాను దూరంగా ఉండాలనుకుంటున్నట్లు హర్షిత్ చెప్పాడన్నారు. దీంతో తాను హర్షిత్ కు కొంత మోటివేషన్ చేశానని తెలిపారు. అయితే కొందరు క్రికెటర్లు మాత్రం కోచ్ గంభీర్ కు హర్షిత్ దగ్గరి బంధువు అని చెబుతున్నారని.. కానీ, నిజానికి ప్రతిభ ఎక్కడ ఉందో గుర్తించి గంభీర్ వారికి మద్దతుగా నిలుస్తారని పేర్కొన్నారు.
వాస్తవానికి ఆసీస్ తో ఫైనల్ మ్యాచ్ కు ముందు గంభీర్.. హర్షిత్ ను తీవ్రంగా మందలించాడని తెలిపారు. ఆటలో రాణించు లేకపోతే జట్టు బయటే కూర్చోబెడతా అంటూ నేరుగా హర్షిత్ కే చెప్పి హెచ్చరించాడని గుర్తు చేశారు. ఇకపోతే ఎంతో మంది క్రికెటర్లకు గంభీర్ అండగా నిలిచాడని.. వారంతా కెరీర్ లో అద్భుతాలు చేశారని తెలిపారు. రాణా ఇంకా 23 ఏళ్ల కుర్రాడేనని.. అతడికి కొంత టైం ఇవ్వాలని శ్రవణ్ చెప్పుకొచ్చాడు.
అనంతరం హర్షిత్‌పై విమర్శలు చేసిన మాజీ క్రికెటర్ శ్రీకాంత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. క్రికెటర్లు రిటైర్ అయిన తర్వాత డబ్బు సంపాదించడం కోసం ఓన్ గా యూట్యూబ్ ఛానెల్ పెట్టి.. అందులో చిన్న కుర్రాళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు.
Also Read : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. వన్డే రిటైర్మెంట్ పై రోహిత్, విరాట్ సంచనల ప్రకటన
Follow Us