IND vs ENG: భారత్కు అదృష్టం కలిసొచ్చింది.. ఈసారి వదలం: ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా
తొలి టీ20 మ్యాచ్లో ఓటమిపై ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ స్పందించాడు. టీమిండియా బ్యాటర్లకు అదృష్టం కలిసి రావడం వల్లనే ఆ జట్టు విజయం సాధించిందని అన్నాడు. రెండో టీ20లో మాత్రం వదిలి పెట్టమని పేర్కొన్నాడు. ఈసారి కచ్చితంగా గెలుస్తామని ఆర్చర్ వెల్లడించాడు.