/rtv/media/media_files/2025/07/11/ind-vs-eng-2025-07-11-19-01-54.jpg)
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. మహమ్మద్ సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి తలో రెండు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు. జో రూట్ 104 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. జామీ స్మిత్ (51), బ్రిడాన్ కార్సే (56) కూడా అర్ధ సెంచరీలు చేసి ఇంగ్లాండ్ స్కోరును 387కి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.
Innings Break!
— BCCI (@BCCI) July 11, 2025
England are all out for 387 in the 1st innings
Jasprit Bumrah the pick of the bowlers with 5/74 🙌
Scorecard ▶️ https://t.co/X4xIDiSUqO#TeamIndia | #ENGvINDpic.twitter.com/0bkkeqskhe