IND vs ENG : ఇవాళే మూడో టెస్టు... గిల్ ముందు అదిరిపోయే రికార్డులు!

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ ల సిరీస్ లో  భాగంగా రెండు టెస్టు మ్యాచ్ లు పూర్తయ్యాయి. లీడ్స్ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించగా, ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ ను 336 పరుగుల తేడాతో భారత్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది.

New Update
ind-vs-eng 3rd test

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ ల సిరీస్ లో  భాగంగా రెండు టెస్టు మ్యాచ్ లు పూర్తయ్యాయి. లీడ్స్ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించగా, ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ ను 336 పరుగుల తేడాతో భారత్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. సిరీస్ ఇప్పుడు 1-1తో సమంగా ఉంది. మూడో మ్యాచ్  ఈ రోజు (జూలై 10) నుండి ప్రారంభం అవుతుంది.  

Also Read :  చంపేశారా,  చనిపోయిందా..  నర్సు దివ్యశ్రీ అనుమానాస్పద మృతి!

లార్డ్స్‌లో భారత్ రికార్డు

లార్డ్స్‌లో భారత్ ఇప్పటివరకు 19 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి వాటిలో 3 మాత్రమే గెలిచింది. 1986లో కపిల్ దేవ్ నాయకత్వంలో తొలి మ్యాచ్‌ను, 2014లో ఎంఎస్ ధోని నాయకత్వంలో రెండో మ్యాచ్‌ను భారత్ గెలుచుకుంది. 2021లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో మూడో మ్యాచ్‌ను 151 పరుగుల తేడాతో గెలుచుకుంది. ఆ మ్యాచ్‌లో, కెఎల్ రాహుల్ భారత్  తరపున 129 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు.  

1932లో లార్డ్స్‌లో భారత్ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఆ సమయంలో, భారత్‌కు సి.కె. నాయుడు నాయకత్వం వహించారు. ఇంగ్లాండ్‌కు డగ్లస్ జార్డిన్ నాయకత్వం వహించారు. ఆ మ్యాచ్‌లో భారత్ 158 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత, లార్డ్స్‌లో తొలి టెస్ట్ విజయం కోసం భారత్ 54 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. 1986లో కపిల్ దేవ్ నాయకత్వంలో తొలి విజయం సాధించారు.

Also Read :  తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

శుభ్‌మన్ గిల్‌కు ఇప్పుడు రికార్డుల్లో తన పేరు లిఖించుకునే సువర్ణావకాశం లభించింది. లార్డ్స్‌లో టెస్ట్ గెలిచిన నాల్గవ భారత కెప్టెన్‌గా అతను రికార్డు సృష్టించగలడు. గిల్ తొలిసారి లార్డ్స్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. ప్రస్తుత సిరీస్‌లో అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. 25 ఏళ్ల భారత కెప్టెన్ రెండు మ్యాచ్‌ల్లో 585 పరుగులు చేశాడు, ఇందులో రెండు అద్భుతమైన సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి. ప్రస్తుత సిరీస్‌లో కెప్టెన్  గిల్‌ 585 పరుగులు చేశాడు. అతను మరో 18 పరుగులు సాధిస్తే ఇంగ్లాండ్‌లో ఆడిన ఓ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా 2002లో ద్రవిడ్‌ నెలకొల్పిన రికార్డును బద్దలు కొడతాడు.

Also Read :  యూఎస్ వెళ్లాలనుకునే వారికి బిగ్ షాక్.. ట్రంప్ సర్కార్ మరో షాకింగ్ నిర్ణయం!

మూడో టెస్టుకు  భారత్ ఒక  మార్పుతో  బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ప్రసిద్ధ్‌ కృష్ణ స్థానంలోకి బుమ్రా వచ్చే అవకాశముంది. ఒక ఇంగ్లాండ్ టీమ్ కూడా జోష్‌ టంగ్‌ స్థానంలో ఆర్చర్‌ను ఎంచుకుని ఇంకే మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.  

లార్డ్స్‌లో ఇంగ్లాండ్ రికార్డు

ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌లో టెస్ట్ రికార్డు గురించి మాట్లాడుకుంటే, ఆ జట్టు ఇక్కడ 145 మ్యాచ్‌లు ఆడి 59 గెలిచి 35 మ్యాచ్‌లలో ఓడిపోయింది. 51 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

Also Read :  అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. తండ్రిని చంపి ఆ తర్వాత సెకండ్‌షోకి!

ind-vs-eng | IND vs ENG 3rd test | Shubman Gill | cricket | sports

Advertisment
Advertisment
తాజా కథనాలు