IND Vs ENG: 4వ టెస్ట్ రబస.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులపై కన్నేసిన రిషబ్ పంత్

మాంచెస్టర్‌ 4వ టెస్ట్‌లో పంత్ ముందు పలు రికార్డులు ఉన్నాయి. కేవలం 40 పరుగులు చేస్తే అతడు భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న అరుదైన రికార్డును బ్రేక్ చేసినవాడవుతాడు. ఇదే మ్యాచ్‌లో 118 పరుగులు చేస్తే, కోహ్లీ రికార్డును కూడా బ్రేక్ చెసే ఛాన్సుంది.

New Update
rishabh pant can create history and break rohit sharma and virat kohli big record

rishabh pant can create history and break rohit sharma and virat kohli big record

IND vs ENG: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు వికెట్ కీపర్ & బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్‌తో దుమ్ము దులిపేస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో అతడు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌లలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఇక ఈ సిరీస్‌లోని నాల్గవ మ్యాచ్‌లో కూడా రిషబ్ పంత్ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. మాంచెస్టర్‌లో జరగనున్న 4వ టెస్ట్‌లో కేవలం 40 పరుగులు చేస్తే పంత్.. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఒక అరుదైన రికార్డును బ్రేక్ చేసినవాడవుతాడు. 

రిషబ్ పంత్ ముందు పెద్ద రికార్డు

2019లో ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను మొదలుపెట్టినప్పటి నుంచి 2025 వరకు రోహిత్ శర్మ ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేశాడు. దాదాపు 69 ఇన్నింగ్స్‌లలో 2716 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రిషబ్ పంత్ రెండవ స్థానంలో ఉన్నాడు. అతడు 66 ఇన్నింగ్స్‌లలో 2677 పరుగులు చేశాడు. 3వ స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ 79 ఇన్నింగ్స్‌లలో 2617 పరుగులు చేశాడు. 4వ స్థానంలో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 65 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 2500 పరుగులు చేశాడు. జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు రవీంద్ర జడేజా ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. జడేజా 64 ఇన్నింగ్స్‌లలో 2212 పరుగులు చేశాడు. 

ఇలాంటి సమయంలో పంత్ కేవలం 40 పరుగులు చేస్తే.. రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా.. WTCలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. దీంతో పంత్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇది మాత్రమే కాకుండా మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో పంత్ 118 పరుగులు చేస్తే.. విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది. .

Advertisment
Advertisment
తాజా కథనాలు