/rtv/media/media_files/2025/07/11/pant-injuire-2025-07-11-20-52-54.jpg)
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ గాయపడ్డాడు.ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 34వ ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా వేసిన ఒక బంతి లెగ్‌సైడ్ వైడ్ అయ్యింది. ఆ బంతిని ఆపే ప్రయత్నంలో రిషబ్ పంత్ ఎడమ చేతి చూపుడు వేలికి తీవ్ర గాయమైంది. బంతి అతని వేలికి బలంగా తాకింది. దీంతో అతని స్థానంలో ధ్రువ్ జురెల్ కీపింగ్ కు వచ్చాడు. ఇక రెండో రోజు కూడా ధ్రువ్ జురెలే కీపర్ గా కొనసాగాడు. అయితే రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ కూడా చేయవచ్చా.. ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి.
ఐసీసీ రూల్స్ ప్రకారం
రిషబ్ పంత్ కు గాయం కావడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది, ఎందుకంటే పంత్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాడు. అతని గాయం తీవ్రతపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పంత్ గాయం తీవ్రమైతే మాత్రం టీమిండియా 10 మంది ఆటగాళ్లతో మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఐసీసీ (ICC) నిబంధనల ప్రకారం రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ చేయలేడు.
🚨 DHRUV JUREL SET TO CONTINUE AS WICKETKEEPER ON DAY 3🚨
— Faruk🐦 (@uf2151593) July 11, 2025
-Rishabh Pant faced a few balls from batting coach Sitanshu Kotak and was uncomfortable...
pic.twitter.com/6a6nGA4aub
సబ్‌స్టిట్యూట్ నిబంధనలు
క్రికెట్‌లో సాధారణ సబ్‌స్టిట్యూట్ (ఫీల్డర్) బౌలింగ్ చేయడానికి లేదా బ్యాటింగ్ చేయడానికి అనుమతించబడడు. అతను కేవలం ఫీల్డింగ్ లేదా వికెట్ కీపింగ్ (అంపైర్ల అనుమతితో) మాత్రమే చేయగలడు. రిషబ్ పంత్ గాయం వేలికి సంబంధించింది, తలకి దెబ్బ తగిలినప్పుడు మాత్రమే బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయడానికి అనుమతించబడతారు, ఎందుకంటే వారి స్థానంలో వచ్చే క్రీడాకారుడు లైక్-ఫర్-లైక్ రీప్లేస్‌మెంట్ అయి ఉండాలి.
కాబట్టి, రిషబ్ పంత్ బ్యాటింగ్ చేయడానికి అన్-ఫిట్‌గా మారితే, భారత్ ఒక బ్యాటర్‌ను కోల్పోయి, 10 మందితో మాత్రమే బ్యాటింగ్ చేయవలసి వస్తుంది. ధ్రువ్ జురెల్ కేవలం వికెట్ కీపింగ్ బాధ్యతలను మాత్రమే ప్రస్తుతానికి చేయగలడు.