/rtv/media/media_files/2025/07/07/bumrah-2025-07-07-20-37-08.jpg)
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌పై రెండో టెస్టులో 336 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ మూడో టెస్ట్ కోసం భారత్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో టెస్ట్ జూలై 10 నుండి 14 వరకు లార్డ్స్‌లో జరుగుతుంది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వస్తాడు. రెండు టెస్టుల్లోనూ భారీగా పరుగులు ఇచ్చిన ప్రసీద్ కృష్ణను జట్టు నుంచి తొలగించే అవకాశం ఉంది.
కుల్దీప్ లేదా అర్ష్‌దీప్
ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని ప్లేయింగ్ ఎలెవన్ నుండి తొలగించవచ్చు. మూడో టెస్ట్ కోసం నితీష్ స్థానంలో కుల్దీప్ లేదా అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకోవచ్చు.నితీష్ కుమార్ రెడ్డి రెండు ఇన్నింగ్స్‌లలో ఒక పరుగు మాత్రమే చేశాడు. రెండో టెస్ట్‌లో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తమ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ముగ్గురు ఆల్ రౌండర్లను ఆడించే బదులు మరో స్పెషలిస్ట్ బౌలర్‌ను తీసుకునే అవకాశం ఉంది.
కరుణ్ నాయర్ విఫలం అవుతున్నప్పటికీ అతనిని జట్టు నుంచి తొలిగించకపోవచ్చు. ఎందుకంటే ఆ స్థానానికి సరైన ఆటగాడు జట్టులో లేడు. దీంతో అతనికి మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది. అయితే జట్టులో ధ్రువ్ జురెల్, అభిమన్యు ఈశ్వరన్ వంటి ప్రభావవంతమైన ఆటగాళ్ళు ఉండటంతో కరుణ్ నాయర్‌కు లార్డ్స్ టెస్ట్ నుండి గేట్ పాస్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.
భారత ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్: యస్సవి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్/అర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా
Also Read : BRS Party : మైనంపల్లికి బిగ్ షాక్ ఇచ్చిన హరీష్ రావు.. బీఆర్ఎస్ లో చేరిన అనుచరులు!
Also read : Virat Kohli : ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025.. కోహ్లీ అన్న కొడుకు ఎంత పలికాడంటే?