/rtv/media/media_files/2025/07/15/ravindra-jadeja-became-2nd-indian-batsman-to-achieve-huge-milestone-in-lords-after-93-years-ind-vs-eng-2025-07-15-10-03-46.jpg)
ravindra jadeja
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ 1 టెస్ట్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. జూలై 10 నుండి 14 వరకు లార్డ్స్‌లో జరిగిన రెడ్-బాల్ మ్యాచ్‌లో జడేజా అరుదైన ఘనతను సాధించాడు. అతడు మొదటి ఇన్నింగ్స్‌లో 131 బంతుల్లో 72 పరుగులు చేశాడు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో 181 బంతుల్లో 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
Also Read: అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. కెమెరా సూపరెహే!
ind vs eng
అయితే 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి జడేజా ఎంతగానో పోరాడినప్పటికీ విజయం అంచుల వరకు వెళ్లి విఫలమయ్యాడు. అయినా అతడు సరికొత్త మైలురాయిని సాధించాడు. లార్డ్స్ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో అర్ధ సెంచరీలు సాధించిన రెండవ భారత బ్యాట్స్‌మన్‌గా జడేజా నిలిచాడు. అతని కంటే ముందు వినూ మన్కడ్ 93 సంవత్సరాల క్రితం ఈ ఘనత సాధించాడు. 1932లో లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో వినూ మన్కడ్ అర్ధ సెంచరీలు చేశాడు.
Also Read: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!
ravindra jadeja
ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత జడేజా వినూ మన్కడ్ 93 ఏళ్ల రికార్డును సమం చేయడం విశేషం. ఇదిలా ఉంటే సోమవారం చేసిన హాఫ్ సెంచరీతో జడేజాకు ఈ సిరీస్‌లో వరుసగా ఇది నాలుగో 50+ స్కోర్ కావడం గమనార్హం.
Twin fifties in a Lord's Test by Indians:
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2025
- Vinoo Mankad in 1932.
- Ravindra Jadeja in 2025*. pic.twitter.com/GKyM69N5VX
Also Read: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
జడేజా 7000 పరుగులు
దీంతోపాటు జడేజా తన ఖాతాలో మరో రికార్డు నెలకొల్పాడు. లార్డ్స్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో భారతదేశం తరపున 61 పరుగులు చేసిన జడేజా అంతర్జాతీయ క్రికెట్‌లో 7000 పరుగులు, 600 వికెట్లు తీసిన నాలుగో క్రికెటర్‌గా కూడా నిలిచాడు. ఈ జాబితాలో భారత్ నుంచి కపిల్ దేవ్ మాత్రమే ఉండగా.. మరో షాన్ పొలాక్, షకీబ్ అల్ హసన్ ఇతర ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు.
జడేజా తన కెరీర్‌లో ఈ మైలురాయిని చేరుకోవడంపై క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. లార్డ్స్ మైదానంలో సెంచరీ చేయకపోయినా, కీలకమైన పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచిన జడేజా, భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.