IND vs ENG : టాస్ గెలిచిన ఇంగ్లాండ్... ఇండియా బ్యాటింగ్!

అండర్సన్‌-తెందూల్కర్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్‌ ప్రారంభం అయింది.  ముందుగా టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ బౌలింగ్‌ ఎంచుకుంది.  దీంతో ఇండియా బ్యాటింగ్ చేయనుంది.

New Update
ind-vs-eng

అండర్సన్‌-తెందూల్కర్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్‌ ప్రారంభం అయింది.  ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు.  ఇది ఈ సిరీస్‌లో స్టోక్స్‌కి వరుసగా నాలుగోసారి టాస్ గెలవడం విశేషం. ఈ పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని, మేఘావృతమైన వాతావరణం కూడా ఇంగ్లాండ్‌కు కలిసి వస్తుందని స్టోక్స్ భావిస్తున్నాడు. దీంతో ఇండియా బ్యాటింగ్ చేయనుంది. ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్‌లో 1-2తో భారత్‌ వెనుబడి ఉంది. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో టాస్ గెలిచి ముందు బౌలింగ్ ఎంచుకున్న ఏ జట్టు కూడా ఇంతవరకు టెస్టు మ్యాచ్ గెలవలేదనేది ఒక ఆసక్తికర విషయం.

ఈ మ్యాచ్ కోసం భారత జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది. కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాష్ దీప్ స్థానాల్లో సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్ తుది జట్టులోకి వచ్చారు. అన్షుల్ కంబోజ్ ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నాడు. ఇంగ్లాండ్ జట్టులో షోయబ్ బషీర్ స్థానంలో లియామ్ డాసన్ వచ్చాడు.

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(సి), రిషబ్ పంత్(w), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (w), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్

Advertisment
తాజా కథనాలు