TG Rains : ఇక నాన్ స్టాప్.. సెప్టెంబర్‌ 2 వరకు తెలంగాణలో వానలు కుమ్ముడే కుమ్ముడు!

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 2025 సెప్టెంబర్‌ 2 వరకు వర్షాలు కొనసాగుతాయని హెచ్చరికలు జారీ చేసింది.  తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది.  

New Update
rains

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 2025 సెప్టెంబర్‌ 2 వరకు వర్షాలు కొనసాగుతాయని హెచ్చరికలు జారీ చేసింది.  తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది.  ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది.  ఉపరితల ఆవర్తనం మరియు తూర్పు, పశ్చిమ గాలుల కలయిక కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్

ఈ హెచ్చరికతతో  రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సహాయం చేయడానికి విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేశారు. గోదావరి, కృష్ణ నదుల పరీవాహక ప్రాంతాల్లో నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అధికారులు. కాగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. సహాయక చర్యల కోసం విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి.

హైద‌రాబాద్ లో మ‌రోసారి వ‌ర్షం

 హైద‌రాబాద్ లో మ‌రోసారి వ‌ర్షం దంచికొడుతుంది. ఈదురుగాలుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురుస్తుంది. ఓ ప‌క్క భారీ వ‌ర్షం కురుస్తుండగా, మ‌రోవైపు ఈదురుగాలులతో నగరమంతా అతలాకుతలమైంది. దీంతో న‌గ‌ర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లన్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వ‌ర‌ద నీటితో మునిగిపోయాయి. ప‌లు చోట్ల విద్యుత్ నిలిచిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  గంట నుంచి ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షం కారణంగా ప‌లు చోట్ల రోడ్లు వ‌ర‌ద నీటితో నిండిపోయాయి. అందరూ ఆఫీసుల నుంచి వచ్చే సమయానికి వర్షం కురవడంతో వాహనదారులు రోడ్లపై చిక్కుకుపోయారు. ర‌హ‌దారుల‌పై భారీగా వాహ‌నాలు నిలిచిపోవడంతో  ప‌లు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆఫీసుల నుంచి నివాసాల‌కు వెళ్లే  సమయం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్స్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ ప్రయాణం కోసం గంటల సమయం పడుతోంది. 

Advertisment
తాజా కథనాలు