Weather Updates: మరో రెండ్రోజులు వణుకు పుట్టించే వెదర్.. ఈ 5 రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ

అక్టోబర్ 6, 7 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అక్టోబర్ 6న అత్యంత తీవ్రత ఉంటుందని అంచనా వేసింది.

New Update
IMD weather update

IMD weather update

దేశ వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులు, కుండపోత వర్షం కారణంగా పలు రాష్ట్రాలు అల్లకల్లోలంగా మారాయి. ఈ ప్రకృతి విపత్తు ఎంతో మంది ప్రజలను బలి తీసుకుంది. ఎన్నో గ్రామాలను తుడిచిపెట్టుకుపోయింది. మరెంతో మందిని నిరాశ్రయులను చేసింది. ఈ ఊహించని విపత్తు కారణంగా వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ వర్షాలు పలు రాష్ట్రాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈదురుగాలులు ప్రజలను ఇంటినుంచి బయటకు రానివ్వడం లేదు. 

IMD weather update

అయితే మరో రెండు రోజులు కూడా వాతావరణం ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 6, 7 తేదీల్లో ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ మేరకు అక్టోబర్ 6న ఢిల్లీ-NCR, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లలో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. వీటిలో ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. 

అదే సమయంలో గాలి వేగం గంటకు 30 నుండి 50 కి.మీ వీస్తుందని ఐఎండీ తెలిపింది. -NCRలో గరిష్ట ఉష్ణోగ్రత రోజంతా 28-30 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రత 22-24 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని అంచనా వేసింది. అలాగే నోయిడా, గురుగ్రామ్‌లలో పనిచేసే వారికి అలర్ట్ జారీ చేసింది. అక్టోబర్ 6, 7 తేదీలలో వివిధ ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అందువల్ల ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ప్రజలు గొడుగులు తీసుకెళ్లాలని వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది. 

ఇదే క్రమంలో రాబోయే రెండు రోజులు రాజస్థాన్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే తూర్పు ప్రాంతాలలో 7 నుండి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది. అంతేకాకుండా ఉత్తర బీహార్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వీటితో పాటు మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

తమిళనాడులో అక్టోబర్ 6న అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్టోబర్ 8 వరకు కర్ణాటకలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అనంతరం అక్టోబర్ 8 తర్వాత వాతావరణం క్రమంగా బలహీనపడుతుందని చెప్పుకొచ్చింది. 

Advertisment
తాజా కథనాలు