/rtv/media/media_files/2025/11/27/rajasthan-farmer-plants-500-notes-in-field-to-protest-unpaid-crop-insurance-claim-2025-11-27-19-30-28.jpg)
Rajasthan Farmer Plants 500 Notes In Field To Protest Unpaid Crop Insurance Claim
సాధారణంగా రైతులు తమ వ్యవసాయ భూముల్లో వరి, మొక్కజొన్న, పత్తి, గోధుమ లాంటి పంటలు పండిస్తుంటారు. కానీ ఓ రైతు మాత్రం వినూత్నంగా తన పొలంలో రూ.500 నోట్లు నాటాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్(rajasthan)లోని నాగౌర్ జిల్లా డియోరియా జతన్ గ్రామంలో మల్లారం బవారీ అనే రైతు ఉన్నాడు. అతడు తన పొలంలో పత్తి పండించడం కోసం బ్యాంకు నుంచి రూ.లక్ష రుణం తీసుకున్నాడు. ఇందుకోసం తన పంటకు బీమా కూడా చేయించుకున్నాడు.
Also Read: దివ్యాంగులకూ.. ఆ చట్టం కావాలి: సుప్రీంకోర్టు
Rajasthan Farmer Plants 500 Notes In Field
किसान ने उगाए 500- 500 के नोट
— NDTV Rajasthan (@NDTV_Rajasthan) November 27, 2025
नागौर के देवरिया जाटान गांव में किसान मल्ला राम बावरी ने फसल खराब होने और बीमा क्लेम न मिलने से नाराज़ होकर अपने खेत में 500-500 रुपये के नोट बो दिए. इस अनोखे विरोध का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है#Rajasthanpic.twitter.com/TW3zAkDi1b
అయితే ఆ ప్రాంతంలో భారీ వర్షాలు(Heavy Rains) కురవడం వల్ల మల్లారం పొలం పూర్తిగా నీటమునిగింది. అతను పండించిన పత్తిపంట పూర్తిగా నాశనమయ్యింది. కేవలం రూ.4 వేల విలువైన పత్తి మాత్రమే ఉండిపోయింది. ఈ క్రమంలోనే పంట పరిహారం కోసం అతను బీమా కంపెనీకి ఫిర్యాదు చేశాడు.
Also Read: వైట్‌హౌస్ వద్ద కాల్పులు.. అమెరికా సంచలన నిర్ణయం
అయితే తన ఫిర్యాదును ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏ ఒక్క అధికారి కూడా తన పొలాన్ని చూడటానికి రాలేదని వాపోయాడు. ఈ క్రమంలోనే వినూత్నంగా ఆందోళనలు చేశాడు. తన పొలంలో ఏకంగా రూ.500 కరెన్సీ నోట్లను నాటాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు అధికారులపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఆ రైతు బీమా పంటకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
Follow Us