Floods: భారీ వరదలు.. 145 మంది మృతి

థాయ్‌లాండ్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సౌత్‌ థాయ్‌లాండ్‌లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటిదాకా 145 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

New Update
Thailand floods

Thailand floods

థాయ్‌లాండ్‌లో భారీ వరదలు(thailand floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. సౌత్‌ థాయ్‌లాండ్‌లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటిదాకా 145 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావానికి ఏకంగా 12 లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసమ్యయాయని పేర్కొన్నారు. అనేకమంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  

Also Read: మావోయిస్టుల లొంగుబాటు, నెరవేరనున్న కేంద్రం లక్ష్యం.. ఇంక ఎంతమంది మిగిలారంటే?

Thailand Floods - 145 People Dead

వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శిథిలాల్లో చాలామంది చిక్కుకుపోయారు. దీంతో వాళ్లను బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే రహదారులు కూడా తీవ్రంగా దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. 

Also Read: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం

Advertisment
తాజా కథనాలు