కాంగ్రెస్ కొంప ముంచిన AAP.. ఆ ఒక్క శాతం ఓట్లు వచ్చుంటే?
హర్యానాలో ఆప్ కారణంగానే కాంగ్రెస్ అత్యల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. బీజేపీకి 39.94, కాంగ్రెస్‌కు 39.09, ఆమ్ ఆద్మీకి 1.79 శాతం ఓట్లు లభించాయి. దీని ఆధారంగా కాంగ్రెస్‌తో ఆప్ పొత్తుపెట్టుకుంటే ఓట్లు చీలేవి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వారిని చూస్తుంటే గర్వంగా ఉంది.. జమ్మూ- కశ్మీర్ ఫలితాలపై మోదీ!
జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. జమ్మూలో బీజేపీ నేతల పనితీరు చూస్తుంటే తనకు గర్వంగా ఉందన్నారు. ‘నేషనల్ కాన్ఫరెన్స్’కు మోదీ అభినందనలు తెలిపారు. అభివృద్ధి, సుపరిపాలనే హర్యానాలో గెలిపించాయని చెప్పారు.
కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన కులసమీకరణాలు.. ఆ వ్యూహంతో బీజేపీ సక్సెస్!
హర్యానాలో కులసమీకరణాలే కాంగ్రెస్‌ను దెబ్బకొట్టినట్లు తెలుస్తోంది. 24 శాతం ఉన్న జాట్ సామాజికవర్గం కాంగ్రెస్‌కు మద్ధతుగా నిలవగా.. జాటేతర ఓటర్లను బీజేపీ తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. ఫలితంగా మూడోసారి బీజేపీ అధికారం చేపట్టనుంది.
Haryana Results: బీజేపీకి కలిసొచ్చిన కాంగ్రెస్ మిస్టేక్స్.. కమలం గెలుపునకు 3 ప్రధాన కారణాలివే!
హర్యానాలో మెజార్టీ పోల్ సర్వేలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కుండబద్దలుకొట్టి చెప్పినప్పటికీ ఫలితాలు తారుమారయ్యాయి. బీజేపీ పార్టీ మేజిక్ ఫిగర్‌ను దాటేసి అధికారాన్ని దక్కించుకుంది. బీజేపీ గెలవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
నేడే హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..
నేడే హర్యానా, జమ్మూకశ్మీర్‌లో ఓట్ల లెక్కింపు జరగనుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవే. అందుకే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
హర్యానాలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 20,632 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. అమరుల కుటుంబాలకు రూ.2 కోట్లు!
హర్యానాలో కాంగ్రెస్ మరో మేనిఫెస్టోను విడుదల చేసింది.అమరవీరుల కుటుంబాలకు రూ.2 కోట్లు అందిస్తామంది. రైతు చట్టాల రద్దు కోసం పోరాడి అమరులైన 736 మంది రైతులకు అమరవీరుల హోదా కల్పిస్తామని, బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది.
Haryana: ఎటూ తేలని సీట్ల పంపకం..ఒంటరి పోరుకు ఆప్ సిద్ధం!
హర్యానాలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సీట్ల పంపకం ఎటూ తేలడం లేదు. పొత్తులపై ఇరు పార్టీల స్థానిక నేతల నుంచి వ్యతిరేకత రావడంతో కూటమిగా ముందుకెళ్లడంపై ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో ఆప్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.