/rtv/media/media_files/2025/04/16/MAIZ9kFL8eB2tIznLJcv.jpg)
Haryana air hostess sexually assaulted in hospital
Rape case: హర్యానాలో దారుణం జరిగింది. అనారోగ్యంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి జరిగడం కలకలం రేపుతోంది. ఆస్పత్రి సిబ్బంది దారుణానికి పాల్పడ్డట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హోటల్‌లో స్విమ్మింగ్ చేస్తుండగా..
ఈ మేరకు భయకంరమైన ఈ ఘటన గురుగ్రామ్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి. ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న మహిళ (46) గురుగ్రామ్‌లో ఓహోటల్‌లో స్విమ్మింగ్ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో ఆమెను వెంటనే సమీపంలోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు హోటల్ సిబ్బంది. ఆమె పరిస్థితి సీరియస్ గా ఉండటతో ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. అయితే ఆ తర్వాత రోజునే ఆసుపత్రి సిబ్బందిలో ఒక వ్యక్తి ఆమెపై లైంగిక దాడి చేశాడు.
ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!
అయితే ఈ విషయాన్ని ఆమె డిశ్చార్జి అయ్యేవరకు ఎవరికి చెప్పలేదు. ఇంటికి వచ్చిన తర్వాత భర్తకు జరిగిదంతా వివరించింది. దీంతో వెంటనే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోర్టులో న్యాయమూర్తి ఎదుట ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు ఫైల్ చేశారు. ప్రస్తుతం సీసీటీవీ పరిశీలిస్తున్న పోలీసులు త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు.
ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్
haryana | air-hostes | sexcual harrisement | hospital | today telugu news