Vinesh Phogat: హర్యానా బీజేపీ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ MLA వినేష్ ఫొగట్‌కు రూ.4 కోట్లు

పారిస్ ఒలంపిక్స్‌ 50కేజీ విభాగంలో అధిక బరువుతో రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడింది. ఆ టైంలో హర్యానా ప్రభుత్వం ఆమెకు పతకం రాకున్నా విజేతగా సత్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆమెకు 3 ఆఫర్లు ఇచ్చింది. అందులో ఫొగట్ రూ.4కోట్ల నగదు బహుమతిని ఎంచుకుంది.

New Update
vinesh phogat

వినేష్ ఫోగట్.. దాదాపు ఈపేరు తెలియనే వారే ఉండరు. ఈ మాజీ ఇంటర్‌నేషనల్ రెజ్లర్‌కు హర్యానా ప్రభుత్వం రూ.4కోట్ల నగదు బహుమతి అందజేయనుంది. ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు ఆమెపై ప్యారిస్ ఒలంపిక్స్‌లో అనర్హత వేటు పడింది. 2024 ఆగస్టులో మహిళల 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో 100 గ్రాముల అధిక బరువు ఉన్నందుకు ఆమె ఫైనల్‌కు చేరుకోలేదు. ఒక్క అడుగు దూరంలో సెమీ ఫైనల్‌లో గెలుపుకు దూరమైంది. పతకం గెలవక పోయినా ఆమె పోరాటాన్ని గుర్తించి అప్పటి హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ ఫోగట్‌ను ఒలింపిక్ విజేతగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. రూ.4 కోట్లు క్యాష్ లేదా నివాస స్థలం లేదా గ్రూప్ ఎ ప్రభుత్వ ఉద్యోగం ఈ మూడిటిలో ఆమె కోరుకున్నది వినేష్ ఫొగట్‌కు ఇస్తామని ఆయన ప్రకటించారు. ఈ రివార్డులు హర్యానా షెహ్రీ వికాస్ ప్రాధికార్ పరిధిలోకి వస్తాయి. హర్యానా రాష్ట్రంలో ప్రతి ఒలంపిక్ విజేతకు నగదు బహుమతి ఇస్తోంది. బంగారు పతక విజేతలకు రూ. 6 కోట్లు, రజత పతక విజేతలకు రూ. 4 కోట్లు మరియు కాంస్య పతక విజేతలకు రూ. 2.5 కోట్లు అందిస్తుంది. ఈక్రమంలో ఆమెకిచ్చిన మూడు ఆప్షన్లో రూ.4 కోట్ల నగదు ఎంచుకుంది.

Also read: రేప్ కేసులో ట్విస్ట్.. అంతా ఆమె ఇష్టపూర్వకంగానే జరిగిందని నిందితుడికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు

ఆమె జింద్ జిల్లాలోని జులానా నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి గవర్నమెంట్ వాగ్ధానాన్ని ఫోగట్ మార్చి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో లేవనెత్తారు. దీంతో హర్యానా క్రీడా శాఖ ఆమెకు ఇచ్చిన మాట నిరవేర్చాలని నిర్ణయం తీసుకుంది.

 

Also read: రూ.63కోట్ల స్కామ్ బయటపెట్టిన ఈడీ.. బ్యాంక్ మాజీ చైర్మెన్ అరెస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు