BIG BREAKING: ఢిల్లీ కాల్పుల కలకలం..ఇద్దరు మృతి
ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ప్రతాప్ నగర్ లో ఇద్దరు వ్యక్తులపై ఒక దుండగుడు ఫైరింగ్ చేశాడు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ప్రతాప్ నగర్ లో ఇద్దరు వ్యక్తులపై ఒక దుండగుడు ఫైరింగ్ చేశాడు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
అమెరికాలోని మినియాపోలిస్ సిటీలో స్కూల్ పై దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు పిల్లలు చనిపోయారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఇదొక ఉగ్రవాద చర్య అని ఎఫ్బీఐ చెబుతోంది. దాంతో పాటూ అతని ఆయుధాలపై షాకింగ్ రాతలు కనిపించాయి.
అమెరికాలోని మినియాపోలిస్ లో ఓ స్కూల్ పై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు. పిల్లలపై కాల్పులు జరిపిన తరువాత దుండగుడు తనను తాను కూడా కాల్చుకున్నాడు.
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బ్రూక్లిన్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్లో ఆదివారం కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన వాతావరణం నెలకొంది.
అమెరికాలోని పిట్సిల్వేనియా కౌంటీలోని గ్రెట్నాలో కొంతసేపటి క్రితం కాల్పులు జరిగాయి. ఇందులో నలుగురు భద్రతా అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. హోమ్ స్టెడ్ డ్రైవ్ లోని ఓ ఇంటిపై గుర్తు తెలియని దుండుగుడు దాడి చేశాడు.
అమెరికా న్యూయార్క్లో కాల్పులు కలకలం రేపాయి. మ్యాన్హట్టన్లోని ఓ కార్యాలయంపై జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మృతులలో ఒక ఆఫ్-డ్యూటీ న్యూయార్క్ నగర పోలీస్ అధికారి కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని చనిపోయాడు.
ఆఫ్రికా దేశం కాంగోలో ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు చర్చి ప్రాంగణంలో జరిపిన దాడుల్లో దాదాపు 21 మంది మృతి చెందారు. తూర్పు కాంగో కోమాండాలోని ఓ క్యాథలిక్ చర్చిపై అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ సభ్యులు ఆదివారం కాల్పులకు తెగబడ్డారు.
ఇరాన్లో ఉగ్రవాదులు కోర్టుపైనే కాల్పులు జరిపారు. సిస్తాన్-బలూచెస్తాన్ ప్రావిన్స్ రాజధాని జహెదాన్లోని కోర్టు బిల్డింగ్పై ఉగ్రవాదులు దాడి చేశారు. తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు పౌరులు, ముగ్గురు దాడి చేసినవారు సహా కనీసం ఎనిమిది మంది మరణించారు.
తుపాకీ గుండు గాయం అనేది అత్యవసర వైద్య పరిస్థితే. తల, గుండె లేదా మెడలో కాల్పులు జరిగితే మరణం చాలా వేగంగా సంభవించే అవకాశం ఉంది. కాల్పుల సమయంలో బుల్లెట్ దూరం కూడా ప్రభావం చూపుతుంది. దగ్గర నుంచే కాల్చినప్పుడు బుల్లెట్ తీవ్ర ప్రభావం చూపుతుంది.