/rtv/media/media_files/2026/02/11/canada-school-2026-02-11-10-30-33.jpg)
కెనడాలో ఓ స్కూల్లో జరిగిన కాల్పులు కలకలం రేపాయి. బ్రిటిష్ కొలంబియాలోని టంబ్లర్ రిడ్జ్ పట్టణంలోని స్కూల్లో జరిగిన ఈ దారుణంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 25 మంది విద్యార్థులు, సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. మార్నింగ్ క్లాసులు జరుగుతున్న టైంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా గన్‌తో స్కూల్లోకి ప్రవేశించింది. విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. కాల్పుల శబ్దంతో పాఠశాల మొత్తం భయాందోళనలతో నిండిపోయింది. విద్యార్థులు ప్రాణభయంతో క్లాస్ రూమ్‌లలో దాక్కున్నారు.
🚨 BREAKING: 10 people are dead, 25 injured after a “woman wearing a dress” opened fire on a school in British Columbia, Canada
— Nick Sortor (@nicksortor) February 11, 2026
Local police are referring to the shooter as a “gunperson.”
Yeah, we all know this is yet another trans mass shooter. pic.twitter.com/McA9C0nmcc
ఈ సమాచారం అందుకున్న వెంటనే కెనడియన్ రాయల్ మౌంటెడ్ పోలీస్, స్పెషల్ సెక్యురిటీ ఫోర్స్ అక్కడికి చేరుకున్నాయి. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లేదా తనను తాను కాల్చుకోనో అనుమానిత మహిళా షూటర్ కూడా మరణించినట్లు ప్రాథమిక వార్తలు అందుతున్నాయి. ఈ ఘటనలో గాయపడిన 25 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉండటం అందరినీ కలిచివేస్తోంది. మరణించిన వారి వివరాలను, షూటర్ ఉద్దేశ్యాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఘటన జరిగిన వెంటనే టంబ్లర్ రిడ్జ్ పట్టణమంతా హై అలర్ట్ ప్రకటించారు. పాఠశాల చుట్టూ భారీగా బలగాలను మోహరించారు. బాంబు స్క్వాడ్ సాయంతో పాఠశాల లోపల ఏవైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే కోణంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో స్థానిక నివాసితులను ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. ఈ ఘటనపై కెనడా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఒక పాఠశాల లోపల ఇలాంటి హింసాత్మక ఘటన జరగడం అత్యంత బాధాకరమని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు. కెనడాలో తుపాకీ సంస్కృతిపై మరోసారి చర్చ మొదలైంది. గన్ కంట్రోల్ చట్టాలను మరింత కఠినతరం చేయాలని ప్రజల నుండి డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దారుణానికి మహిళా షూటర్ ఎందుకు ఒడిగట్టిందనేది మిస్టరీగా మారింది.
#BREAKING: RCMP Responds To Active Shooter Incident At📍Tumbler Ridge Secondary School In BC.
— 401_da_sarpanch (@401_da_sarpanch) February 11, 2026
⚠️ 10 Confirmed Dead Including, Suspect Described As Female In A Dress With Brown Hair Was Located Deceased. 25 Others Injured. Students At School Have Been Released To Parents. 🙏🌺 pic.twitter.com/jMDSyvNL0m
Follow Us