/rtv/media/media_files/2025/10/25/dcp-fires-on-cellphone-thieves-2025-10-25-17-43-36.jpg)
DCP fires on cellphone thieves
హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య, ఆయన గన్ మన్ కాల్పులు జరిపారు. సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న దొంగను పట్టుకునే యత్నం చేసిన డీసీపీ చైతన్య పై దొంగ కత్తితో దాడికి యత్నించాడు. దీంతో డీసీపీ చైతన్య స్వయంగా దొంగపై గన్ ఫైర్ చేశారు. చాదర్ ఘాట్ లో జరిగిన ఈ ఘటనలో సెల్‌పోన్ దొంగల మీద డీసీపీ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య..సీపీ కార్యాలయంలో మీటింగ్‌కు వెళ్లి తన సిబ్బందితో తిరిగి తన కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో చాదర్ ఘాట్ వద్ద సెల్‌ఫోన్ చోరీ చేసి పారిపోతున్న ఇద్దరు దొంగలను గుర్తించారు. అయితే వారిని పట్టుకునేందుకు డీసీపీ చైతన్యతో పాటు సిబ్బంది ప్రయత్నించారు. అయతే ఇద్దరు దొంగల్లో ఓ దొంగ కత్తితో దాడికి దిగాడు.
ఈ క్రమంలో కత్తి లాక్కూనేందుకు డీసీపీ చైతన్య గన్ మ్యాన్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతను కిందపడిపోయాడు. వెంటనే దొంగ కత్తితో దాడి చేసే ప్రయత్నం చేయడంతో అప్రమత్తమైన డీసీపీ చైతన్య గన్‌మ్యాన్ వెపన్ తీసుకుని దొంగపై మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో దొంగకు ఛాతి, వెన్ను భాగంలో మూడు చోట్ల గాయాలయ్యాయి.
అయినప్పటికీ తప్పించుకునే క్రమంలో దొంగ భవనంపై నుంచి విక్టరీ మైదానంలోకి దూకాడు. తీవ్రగాయాలతో కింద పడిపోయిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. బంజారాహిల్స్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించగా ఘటనా స్థలిని సౌత్, సెంట్రల్ జోన్ డీసీపీలు స్నేహా మెహ్రా, శిల్పావళి పరిశీలించారు. దొంగతో జరిగిన పెనుగులాటలో స్వల్పంగా గాయపడిన డీసీపీ చైతన్యకు మలక్‌పేట ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఘటనా స్థలాన్ని నగర సీపీ సజ్జనార్ సందర్శించారు.
Follow Us