America: మరో భారతీయుడి దారుణ హత్య.. బాగున్నావా? అని అడిగినందుకే చంపేశాడు!

అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్‌బర్గ్‌లో ఓ భారతీయ మోటెల్(హోటల్) యజమాని దారుణ హత్యకు గురయ్యారు. పార్కింగ్ స్థలంలో జరుగుతున్న గొడవను ఆపేందుకు వెళ్లిన ఆయన్ని దుండగుడు గన్‌తో కాల్చి చంపాడు. నిందితుడిని ఏం పర్లేదు కాదా అని అడిగినందుకే హత్య చేశాడు.

New Update
USA firing

అమెరికాలో భారత సంతతి ప్రజలపై జరుగుతున్న దాడులు, హత్యలు మరోసారి కలకలం రేపాయి. తాజాగా, పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్‌బర్గ్‌లో ఓ భారతీయ మోటెల్(హోటల్) యజమాని దారుణ హత్యకు గురయ్యారు. సెప్టెంబర్ 10న డల్లాస్‌లో కూడా మోటెల్ మేనేజర్‌గా పనిచేస్తున్న 50 ఏళ్ల చంద్రమౌళి నాగమల్లయ్యను అక్కడ పనిచేసే వ్యక్తి హత్య చేశాడు. ఒక చిన్నపాటి వాగ్వాదం ఈ దారుణానికి దారితీసింది. ఆ తర్వాత ఆ తలను కాలితో తన్ని, చెత్తబుట్టలో పడేశాడు.

తాజాగా.. రోబిన్సన్ టౌన్‌షిప్‌లోని పిట్స్‌బర్గ్ మోటెల్‌ను నిర్వహిస్తున్న 51 ఏళ్ల రాకేశ్ ఎహగబన్ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. హోటల్‌లో ఉన్న వ్యక్తి మొదట అతనితోపాటు ఉన్న మహిళను కాల్చి చంపాడు. శుక్రవారం మధ్యాహ్నం మోటెల్ పార్కింగ్‌లో ఓ మహిళపై తుపాకీతో దాడి జరిగిందన్న విషయం తెలుసుకుని రాకేశ్ ఎహగబన్ బయటకు వచ్చారు. అక్కడ నిలబడి ఉన్న 37 ఏళ్ల స్టాన్లీ యూజీన్ వెస్ట్ వద్దకు వెళ్లి, ఫ్రెండ్లీగా, "ఏం పర్లేదు కదా, బడ్?" (ఆర్ యూ ఆల్ రైట్?) అని అడిగారు. హోటల్ సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ప్రకారం, ఆ మాట వినగానే వెస్ట్ వెంటనే అతని గన్‌తో రాకేశ్ తలపై కాల్చాడు. తీవ్ర గాయాలైన రాకేశ్ అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ కాల్పుల తర్వాత నిందితుడు వెస్ట్ అక్కడి నుంచి వ్యాన్‌లో పారిపోయాడు. హోటల్‌లో స్టే చేసిన వెస్ట్‌ను ట్రాక్ చేసిన పోలీసులు, పిట్స్‌బర్గ్‌లోని ఈస్ట్ హిల్స్ ప్రాంతంలో గుర్తించారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ఒక డిటెక్టివ్‌కు కూడా గాయాలయ్యాయి. నిందితుడు వెస్ట్‌ను పట్టుకునే క్రమంలో పోలీసులు ఫైరింగ్ చేశారు. నిందితుడిని గాయాలతో అదుపులోకి తీసుకున్నారు. రాకేశ్ హత్యపై భారతీయ సమాజం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కేవలం మంచి మాట అడిగినందుకే ఒక ప్రాణం తీయడం అత్యంత క్రూరమైన చర్యగా అభివర్ణించారు. నిందితుడిపై క్రిమినల్ హోమిసైడ్, హత్యాయత్నం వంటి అభియోగాలను మోపారు.

Advertisment
తాజా కథనాలు