BREAKING: చార్మినార్ అగ్ని ప్రమాద బాధితులకు మోదీ పరిహారం
చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున మోదీ పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామని మోదీ వెల్లడించారు.
Charminar Fire Accident: గుల్జారీ హౌజ్ అగ్ని ప్రమాదం.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
హైదరాబాద్‌లోని చార్మినార్ గుల్జార్ హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాదంపై ఆరాతీశారు. ప్రమాద ఘటన పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మాట ఇచ్చారు.
Fie Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 17 మంది మృతి
హైదరాబాద్‌లోని చార్మినార్ గుల్జార్ హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం జరగ్గా 17 మంది మృతి చెందారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏసీ కంప్రెసర్ పేలడం వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Fire Accident: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరు నెలల చిన్నారితో సహా ఆరుగురు..?
మహారాష్ట్ర శిర్పూర్ జైన్ బస్ స్టాండ్ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఏర్పడ్డాయి. ఈ మంటల్లో ఆరు నెలల చిన్నారితో పాటు మరో ఆరుగురు చిక్కుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వీరిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం!
హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలో ఆకస్మాత్తుగా కాలిపోయే వాసన, పొగలు బయటకు రావడంతో స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమైన నాలుగు ఫైరింజన్లతో మంటల్ని అదుపు చేస్తున్నారు.
Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. VIDEO
హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.భవనం పూర్తిగా కాలిపోయింది. పక్కన బిల్డింగ్‌లకు కూడా మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.
Fire Accident: అయ్యో పాపం.. భారీ అగ్నిప్రమాదం - ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవదహనం
యూపీలోని కాన్పుర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐదంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ కుటుంబం మొత్తం సజీవదహనం అయింది. మృతుల్లో భర్త మహ్మద్ డానిశ్, భార్య నజ్నీన్ శభ, పెద్ద కుమార్తె సారా, మధ్య కుమార్తె సిమ్రా, చిన్న కుమార్తె ఇనయా ఉన్నారు.
Secundrabad Fire Accident: సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ సెంటర్ SBI బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్‌తో ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో బ్యాంకులోని కీలక ఫైల్స్ దగ్ధం అయినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతుంది.