Bus Fire Accident : ఘోర బస్సు ప్రమాదం.. 12 మంది సజీవదహానం!

రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. జైసల్మేర్ నుండి జోధ్‌పూర్ వెళ్తున్న AC స్లీపర్ ప్రైవేట్ బస్సు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. ఈ సంఘటన వార్ మ్యూజియం సమీపంలో జరిగింది.

New Update
bus accident

రాజస్థాన్‌(rajasthan) లోని జైసల్మేర్ జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం(fire accident) జరిగింది. జైసల్మేర్ నుండి జోధ్‌పూర్ వెళ్తున్న AC స్లీపర్ ప్రైవేట్ బస్సు అకస్మాత్తుగా మంటల్లో(bus-fire-accident) చిక్కుకుంది. ఈ సంఘటన వార్ మ్యూజియం సమీపంలో జరిగింది. ఈ ఘటనలో దాదాపు 12 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇందులో 3 మంది పిల్లలు, 3 మంది మహిళలు సహా 12 మంది సజీవదహానం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 57 మంది ఉన్నారని చెబుతున్నారు. 32 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. మంటల్లో బస్సు పూర్తిగా కాలిబూడిదైపోయింది.  

మంటలు చాలా వేగంగా వ్యాపించడంతో చాలా మంది ప్రయాణికులు తప్పించుకోలేకపోయారు. బస్సులోని ప్రయాణికుల ప్రకారం, అకస్మాత్తుగా వచ్చిన పొగ ప్రయాణికులందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. కొందరు వెంటనే కిటికీలు పగలగొట్టి బయటకు దూకారు. మంటల ధాటికి చాలా మంది కాలిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

Also Read :  బీజేపీ ఫస్ట్ లిస్టు రిలీజ్..9 మంది మహిళలకు చోటు

స్ట్రెచర్లు దొరకని వారిని చేతుల్లో

గాయపడిన వారిని వెంటనే మూడు అంబులెన్స్‌లలో జవహర్ ఆసుపత్రికి తరలించారు. బస్సు మంటలు సంఘటనా స్థలంలో తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. స్థానికులు కూడా గాయపడిన వారికి సహాయ హస్తం అందించారు. స్ట్రెచర్లు దొరకని వారిని చేతుల్లో మోసుకుని లేదా భుజాలపై మోసుకుని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు 35 మంది గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స పొందుతున్నారు. వైద్యుల ప్రకారం, చాలా మంది ప్రయాణికులు 30 నుండి 50 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు.

అయితే, బస్సులో మంటలు వ్యాపించడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బస్సు ఇంజిన్‌ లేదంటే వైరింగ్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. 

Also Read :  మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ లొంగిపోయిన మల్లోజుల

Advertisment
తాజా కథనాలు