Fire Accident: ఢిల్లీ MP క్వార్టర్స్‌లో అగ్ని ప్రమాదం

ఢిల్లీలోని బీడీ మార్గ్‌లో MPల నివాస సముదాయాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పార్లమెంట్ భవనానికి సమీపంలో ఉన్న రాజ్యసభ సభ్యులకు కేటాయించిన బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్ మంటలు వ్యాపించాయి. అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తులో ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి.

New Update
Brahmaputra Apartments

దేశ రాజధాని ఢిల్లీ(delhi)లోని బీడీ మార్గ్‌లో MPల నివాస సముదాయాల్లో భారీ అగ్ని ప్రమాదం(fire accident) సంభవించింది. పార్లమెంట్ భవనానికి సమీపంలో ఉన్న రాజ్యసభ సభ్యులకు కేటాయించిన బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్ మంటలు వ్యాపించాయి. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసినప్పటికీ, నివాస సముదాయాల నిర్వహణపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు చెలరేగాయి.

Also Read :  ఇది ట్రైలరే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్‌ సింగ్‌ స్ట్రాంగ్ వార్నింగ్

Fire Accident In MP Apartment

అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తులో ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు, భద్రతా సిబ్బంది ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న వెంటనే దాదాపు 10కి పైగా ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని, అగ్నిమాపక సిబ్బంది సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రాథమికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌గా అనుమానిస్తున్నారు.

Also Read :  మరో భూకంపం.. గజగజ వణికిపోయిన ప్రజలు

ఈ ఘటనపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా అపార్ట్‌మెంట్‌ల నిర్వహణ బాధ్యత వహించే ఏజెన్సీపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. "ప్రజా ప్రతినిధులు ఉండే అత్యంత సురక్షిత ప్రాంతంలోనే భద్రత, సరైన నిర్వహణ లోపించడం దేనికి సంకేతం? ఎంపీల క్వార్టర్స్‌లోనే అగ్నిమాపక భద్రతా చర్యలు పటిష్టంగా లేకపోతే, సామాన్య పౌరుల పరిస్థితి ఏమిటి?" అని ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నించారు. నిర్వహణలో నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని వారు ఆరోపించారు.

Advertisment
తాజా కథనాలు