Fire Accident: విమానం గాల్లో ఉండగా మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు.. VIDEO

విమానం గాల్లో ఉండగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. చైనాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడి లగేజీలో బ్యాటరీ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో విమానాల్లో ఉన్న ప్రయాణికులందరూ భయందోళన చెందారు. చవిరికి విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది.

New Update
Air China flight diverted to Shanghai after battery in luggage catches fire

Air China flight diverted to Shanghai after battery in luggage catches fire

విమానం గాల్లో ఉండగా మంటలు చెలరేగడం(Fire Accident) కలకలం రేపింది. చైనా(china) లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడి లగేజీలో బ్యాటరీ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో విమానాల్లో ఉన్న ప్రయాణికులందరూ భయందోళన చెందారు. మంటలు రావడంతో విమాన సిబ్బంది అప్రమత్తమయ్యారు. చివరికి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. శనివారం  ఎయిర్‌ చైనా అనే ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం తూర్పు చైనాలోని హౌంగ్‌జౌ నుంచి సౌత్ కొరియాలోని సియోల్ సమీపంలో ఇంచియాన్‌కు బయలుదేరింది.  

Also Read: కాలి బూడిదైన ఢాకా ఎయిర్‌పోర్ట్.. భారీ అగ్నిప్రమాదం (VIDEO)

Air China Flight Diverted To Shanghai

విమానం గాల్లో ప్రయాణిస్తుండగా ఓ ప్రయాణికుడి లగేజీలో లిథియం బ్యాటరీ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఓవర్‌హెడ్‌ బిన్ నుంచి మంటలు బయటకు రావడంతో ప్రయాణికులు భయపడిపోయారు. దీంతో వెంటనే అలెర్ట్ అయిన విమాన సిబ్బంది షాంఘై విమానశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: పహల్గామ్‌లో టూరిస్టులు.. నేడు అఫ్గాన్‌లో క్రికెటర్లు.. పాక్ దొంగ దెబ్బల చరిత్ర ఇదే!

Advertisment
తాజా కథనాలు