BIG BREAKING: మంటల్లో కాలిబూడిదైన ట్రైన్.. గజగజ వణికిపోయిన ప్రయాణికులు

పంజాబ్ గరీబ్ రథ్ రైలులో అగ్ని ప్రమాదం భయందోళనకు గురి చేసింది. లూధియానా-ఢిల్లీ మార్గంలో సర్హింద్ వద్ద ఒక ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగాయి. లోకో పైలట్ అప్రమత్తతతో రైలును ఆపి, ప్రయాణికులను సురక్షితంగా దించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం జరగలేదు.

New Update
Punjab train Fire Accident

Punjab train Fire Accident

పంజాబ్‌లో ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగాయి. లూథియానా నుండి ఢిల్లీకి వెళ్తున్న అమృత్‌సర్-సహర్సా గరీబ్ రథ్ రైలులో మంటలు కలకలం రేపాయి. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు సిర్హింద్ స్టేషన్ దాటిన వెంటనే కోచ్ నంబర్ 19 నుండి పొగలు రావడం ప్రారంభమైంది. దీంతో ప్రయాణికులు కేకలు వేయడంతో రైలు అంతటా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ కోచ్‌లో అనేక మంది వ్యాపారవేత్తలు ఉండటంతో వారు గొలుసు లాగి రైలును ఆపినట్లు సమాచారం. దీంతో పైలట్ వెంటనే ప్రయాణికులందరినీ కిందికి దింపి ఈ విషయం గురించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.

Punjab train Fire Accident

సమాచారం అందుకున్న రైల్వే స్టేషన్ అధికారులు, సిబ్బంది, GRP, RPF, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అనంతరం రైల్వే అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ప్రయాణికులను ఇతర కోచ్‌లకు సురక్షితంగా తరలించారు. ఆపై ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి విశ్వప్రయత్నాలు చేసి.. చివరికి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. 

కాగా అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రైల్వే ఇంజనీర్ల బృందం ఇప్పటికీ కారణాన్ని పరిశీలిస్తోంది. గందరగోళంలో రైలు దిగుతున్నప్పుడు అనేక మంది ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోల్లో ప్రయాణీకులు తమ లగేజీని పట్టాలపై ఉంచుకుని నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్నారు. 

రైల్వే విడుదల చేసిన ఒక ప్రకటనలో.. TTE, రైలు పైలట్ మంటల గురించి రైల్వే కంట్రోల్ బోర్డుకు సమాచారం అందించారని, సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, కానీ రైలు దిగడానికి తొందరపడటంతో కొంతమంది గాయపడి చికిత్స పొందారని తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు