Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం.. రూ.8వేల కోట్లకు పైగా భారీ నష్టం

ఇటీవల బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎయిర్‌పోర్టులో ఉన్న ముడిసరకు, వస్త్రాలు కాలిపోయాయి. దీంతో అక్కడి వస్త్ర పరిశ్రమకు ఏకంగా రూ.8700 కోట్ల నష్టం వచ్చినట్లు సమాచారం.

New Update
Bangladesh garment exporters fear 8700 crores losses after massive airport fire

Bangladesh garment exporters fear 8700 crores losses after massive airport fire

ఇటీవల బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కార్గో కాంప్లెక్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎయిర్‌పోర్టులో ఉన్న ముడిసరకు, వస్త్రాలు కాలిపోయాయి. దీంతో అక్కడి వస్త్ర పరిశ్రమకు ఏకంగా రూ.8700 కోట్ల నష్టం వచ్చినట్లు సమాచారం. ఎగుమతులు, దిగుమతులు జరిగే సీజన్‌లో ఈ అగ్ని ప్రమాదం జరగడంతో ఆ దేశంలోని వస్త పరిశ్రమకు భారీ వాటిల్లింది. 

Also Read: ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్ హత్యకు మరో కుట్ర.. చెట్టుపై నుంచి స్కోప్!

ఎయిర్‌పోర్టులోకి భారీగా దిగుమతి చేసుకున్న ముడి పదార్థాలు, వస్త్రాలు కాలిపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయినట్లు బంగ్లాదేశ్‌ వస్త్ర తయారీదారుల ఎగుమతిదారుల సంఘం డైరెక్టర్ ఫైసల్ సమద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వస్త్ర పరిశ్రమ భవిష్యత్తుపై కూడా ప్రభావం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు వాపోయారు. తమదేశంలో ప్రతిరోజూ 250కు పైగా కర్మాగారాలకు ఆ కార్గో కాంప్లెక్స్‌ నుంచే సరకులు రవాణా అవుతాయని తెలిపారు. 

Also Read: నిరసనకారులపై బురద చల్లిన ట్రంప్.. AIతో అమెరికా అధ్యక్షుడి వింత శేష్టలు

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వస్త్రాల ఎగుమతిదారుగా చైనా తర్వాత బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉంది. కేవల ఈ వస్త్ర పరిశ్రమ ద్వారానే బంగ్లాదేశ్‌లో 40 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. ఆ దేశం నుంచే ప్రపంచ దేశాలకు అనేక బ్రాండెడ్ దుస్తులను ఎగుమతి చేస్తారు. అయితే విమానాశ్రయంలో జరిగిన అగ్నిప్రమాదం వల్ల ఇతర దేశాలకు జరిగే దుస్తుల ఎగుమతుల్లో ఎక్కువ రోజుల పాటు ఆలస్యం జరుగుతుందని బంగ్లాదేశ్ వస్త్ర తయారీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరలయ్యాయి. 

Also Read: అయ్యో ఘోరం ప్రమాదం.. సముద్రంలో పడిపోయిన విమానం (వీడియో)

Advertisment
తాజా కథనాలు