/rtv/media/media_files/FlwvGrizYkiUSWoZfOAF.jpg)
తమిళనాడు శివకాశీలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో (Fireworks Shop) భారీ అగ్ని ప్రమాదం (fire accident) చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. అలాగే అగ్ని ప్రమాదం సమయంలో యూనిట్ లో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి తీవ్రంగా శ్రమించారు. అయితే ఈ ప్రమాదంలో ఏదైనా ప్రాణ నష్టం జరిగిందా? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Huge stock of #fireworks goods destroyed by accidental fire at crackers shop at Anuppankulam in #Sivakasi on Sunday. Five fire tenders struggled for more than 90 minutes to put out the flame. @THChennai#fire#accident#crackers#shoppic.twitter.com/XUDQX6JInv
— Sundar Subbiah (@SundarSubbiah) October 5, 2025
Also Read : బహిరంగ సభలో I Love You అని చెప్పిన కేంద్రమంత్రి! -Video Viral
ఇటీవలే మరో అగ్ని ప్రమాదం
ఇదిలా ఉంటే ఇటీవలే.. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం వెదురుపాక సావరం గ్రామంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Also Read : విద్యార్థికి ఘోర అవమానం.. ఫీజు చెల్లించలేదని నేలపై కూర్చోబెట్టి పరీక్షలు