వేటకొడవళ్లతో వేటాడి వెంటాడి..నంద్యాలలో నరరూప రాక్షసులు| Nandyal Farmer Incident | Land Disputes| RTV
మిర్చీ పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. గణేష్ అనే రైతు ఎనిమిది ఎకరాల్లో మిర్చి, పత్తి పంటను సాగు చేశాడు. క్వింటానర మాత్రమే దిగుబడి రావడంతో పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ ఫెన్సింగ్ వేసి అడవి పందుల నుంచి పంటను రక్షించుకోవాలనుకున్న రైతు కుటుంబం విద్యుత్ఘాతంతో చనిపోయింది. కరెంట్ వైర్ తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, తల్లి, కొడుకు మృతి చెందారు.
ఆదిలాబాద్ పట్టణంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బ్యాంకు అధికారుల వేధింపులు తాళలేక ఓ రైతు బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పురుగులమందు తాగి ఆ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
హర్యాణా, పంజాబ్ రైతులు డిసెంబర్ 8 (ఆదివారం) ఛలో ఢిల్లీ ర్యాలీగా బయలుదేరారు. రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీ చార్జ్ చేశారు. బార్కెట్లను దాటడానికి వచ్చే రైతులను చెదరగొట్టారు.
జిల్లాలో పెద్దపులి మరోసారి రెచ్చిపోయింది. పొలానికి వెళ్లిన రైతు సురేశ్‌పై దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన సిర్పూర్(టి) మండలం దుబ్బగూడ శివారులో జరిగింది. తోటి రైతులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.
చిత్తూరు జిల్లా సోమల మండలంలో ఏనుగుల గుంపు దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా 120 బాక్సులలో నిల్వ ఉంచిన టమోటాలను ఏనుగులు తొక్కి ధ్వంసం చేశాయి. దీంతో బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రూ. 2 లక్షల నష్టం వచ్చిందని వాపోతున్నాడు.
రైతును అవమానించిన షాపింగ్ మాల్ సిబ్బందికి బుద్ధి చెప్పింది కర్ణాటక ప్రభుత్వం. ఏడు రోజులపాటూ మాల్‌ను మూసేయాలని ఆర్డర్ పాస్ చేసింది. ఎలాంటివారినైనా అవమానించే హక్కు ఎవరికీ లేదని గవర్నమెంట్ చెప్పింది.
సింగరేణి మండలంలోని ఉసిరికాయపల్లి లో భద్రయ్య అనే రైతు గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన పొలాన్ని మరిపెడ బంగ్లాకు చెందిన ఆర్టీఐ మాజీ కమిషనర్ శంకర్ నాయక్ అక్రమంగా కబ్జా చేశాడని మనస్థాపం చెంది తన పొలంలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.