/rtv/media/media_files/2025/08/11/rythu-bheema-2025-08-11-11-49-44.jpg)
Rythu Bheema
తెలంగాణ ప్రభుత్వం(TG Government) రైతు బీమా పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది ఆగస్టు 14 నుంచి ఆ తర్వాతి ఏడాది ఆగస్టు 13 వరకు ఈ బీమా కొనసాగుతోంది. ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందాలంటే ప్రతి ఏడాది నిర్ణీత కాలంలో తప్పకుండా దీన్ని పునరుద్ధరణ (రిన్యువల్) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కింద నమోదైన రైతు ఒక వేళ చనిపోతే.. ఆయన నామినీ (కుటుంబ సభ్యుడు)కి రూ.5 లక్షల బీమా పరిహారం వస్తుంది. వ్యవసాయ అధికారులు(AEO) లు ఆ నామినీ నుంచి చనిపోయిన రైతు బీమా డెత్ క్లెయిమ్ దరఖాస్తును, అలాగే అవసరమైన సర్టిఫికేట్లు స్వీకరిస్తారు.
Also Read : 13 నుంచి మరింత భారీ వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి
Farmer Rythu Bima Insurance
రైతు మరణం తర్వాత రెండుమూడు రోజుల్లోపే సంబంధిత సర్టిఫికేట్లను ఆన్‌లైన్ పోర్ట్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) ద్వారా 10 రోజుల్లోపే నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలో నిధులు జమ అవుతాయి. ఎవరైనా రైతు అనుకోని పరిస్థితుల్లో చనిపోతే అతని కుటుంబాన్ని ఆదుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందినవాళ్లు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. అయితే ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే రైతులు తమ పట్టదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్‌ను స్థానిక AEO అధికారికి ఇవ్వాలి.
Also Read : కాంగ్రెస్ కు బిగ్ షాక్.. మైనంపల్లి ఎంట్రీతో కీలక నేత రాజీనామా!
ఆ తర్వాత ఏఈవో వ్యవసాయశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో తమ యూజర్ ఐడీతో లాగిన్ అవుతారు. దరఖాస్తు చేసిన రైతు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఈ స్కీమ్ కింద రైతుల తరఫున LIC ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇలా చేయడం వల్ల రైతు కుటుంబాన్ని ఆర్థిక భారమే ఉండదు. ఇక కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఆగస్టు 13వ తేదీ లోపు తప్పకుండా తమ ప్రాంత AEOని సంప్రదించాలి. దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలి.
Also Read : భారత్ రాజధానిగా హైదరాబాద్..! ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ చెప్పిన సమాధానం వైరల్
రైతు గడువు ముగిసే లోపు చేసుకుంటే ఈ బీమా సదుపాయం దక్కుతుంది. రైతు దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక.. ప్రభుత్వం అర్హులైన రైతులనుఈ పథకంలో చేర్చుతుంది. ప్రమాదం లేదా అనుకోని సందర్భాల్లో రైతు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ పథకం 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉండే రైతులకే వర్తిస్తుంది. వయోపరిమితి ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా వారు ఈ స్కీమ్‌లో చేరలేరు. అనుకోని ప్రమాదాల వల్ల రైతులు చనిపోయినప్పుడు ఈ స్కీమ్ ఆ కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.
Also Read :BRS పార్టీని లైట్ తీసుకోండి.. KTRతో విభేదాలు ఒప్పుకున్న కవిత
rtv-news | telugu-news | latest telangana news | latest-telugu-news