KTR : రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడాలి...కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 750 మందికి పైగా రైతులు మరణించారని, అయినా రేవంత్‌ రెడ్డికి చీమ కుట్టినట్టు కూడా లేదని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. సీఎం నిర్వాకంతో ఇవాళ జమ్మన్న అనే రైతు గుండె పగిలి మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
ktr vs revanth reddy

KTR vs Revanth Reddy

KTR On CM Revanth: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 750 మందికి పైగా రైతులు మరణించారని , అయినా రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. గత కొంతకాలంగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్న రైతుల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.  ఇప్పటికైనా రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నిర్వాకంతో ఇవాళ జమ్మన్న అనే రైతు గుండె పగిలి మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మన్న కుటుంబానికి రూ.25లక్షల పరిహారం అందిచాలని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ డిమాండ్ చేశారు..


 
 పంట కొనే దిక్కులేక వ్యవసాయ మార్కె్ట్లో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తనువు చాలిస్తు్న్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, ఈ రోజు గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని కలుకుంట్ల మొక్కజొన్న కేంద్రం వద్ద జమ్మన్న అనే రైతు గుండెపోటుతో కుప్పకూలి మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. జరిగిన ఈ ఘటనకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదే అని కేటీఆర్‌ పేక్కొన్నారు. గడచిన నాలుగు రోజులుగా కోనుగోలు కేంద్రం వద్ద  పడిగాపులు పడుతున్నా కూడా మొక్కజొన్న పంట కొనకుండా కాంగ్రెస్ సర్కారు అన్నదాత నిండు ప్రాణాన్ని బలితీసుకుందని ఆరోపించారు.

ఓ వైపు పెట్టుబడి సాయం అందక అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మరోవైపు భారీ వర్షాలతో పంట నష్టపోయినా కూడా కనీసం పరిహారం అందక కౌలు రైతులు సైతం బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకోవైపు పనికిరాని యాప్‌లతో యూరియా అందక అన్నదాతలు మళ్లీ ఈ సీజన్‌లోనూ అష్టకష్టాలు పడుతున్నారన్నారని విమర్శించారు. పదేళ్లపాటు సంతోషంగా సాగిన సాగును కన్నీటి సేద్యంగా మార్చి.. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిన ఈ పాపం ఊరికే పోదని కేటీఆర్‌ విమర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్న రైతుల కష్టాలు తీర్చేందుకు ఇప్పటికైనా రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడాలన్నారు. 

Advertisment
తాజా కథనాలు