/rtv/media/media_files/2025/07/26/chitoor-2025-07-26-21-54-22.jpg)
చిత్తూరు జిల్లా కొత్తూరు ప్రాంతంలో ఏనుగుల మంద ఓ రైతుని బలితీసుకున్నాయి. కొత్తూరు వద్ద వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణంరాజు మృతి చెందాడు. పొలం పనులు చేస్తుండగా రామకృష్ణంరాజుపై ఏనుగులు ఒక్కసారిగా దాడి చేశాయి. 3 రోజులుగా రాజు మృతదేహం వద్దే ఏనుగులు ఉన్నాయి. దీంతో వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం ఎవరూ చేయలేదు. సుమారు 16 ఏనుగులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
చిత్తూరు జిల్లాలో ఏనుగుల భీభత్సం
— Telugu Feed (@Telugufeedsite) July 26, 2025
సోమల మండలం కొత్తూరు వద్ద పొలాల్లో రైతుపై ఏనుగుల గుంపు దాడి.. రైతు కృష్ణంరాజు మృతి.
పొలం పనులు చేస్తుండగా ఒక్క సారిగా దాడి చేసిన ఏనుగుల గుంపు.. రైతు అక్కడికక్కడే మృతి#AndhraPradeshpic.twitter.com/mTuygYFhEZ