UP Crime : పంచాయతీ పెద్దల అరాచకం.. వివాహితను చెట్టుకు కట్టేసి.. చెప్పుల దండ మెడలో వేసి!
యూపీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో ముగ్గురు పిల్లల తల్లి అయిన వివాహితను పంచాయతీ పెద్దలు చెట్టుకు కట్టేసి కొట్టారు. అక్కడితో ఆగకుండా ఆమె మెడలో చెప్పుల దండ వేశారు.ముఖానికి నల్లరంగు పూసి దారుణంగా ప్రవర్తించారు.