Andhra Pradesh : వివాహేతర సంబంధం.. స్పందించిన ఎంపీ విజయసాయిరెడ్డి

వివాహేతర సంబంధం ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ప్లాన్ ప్రకారమే నాపై కొందరు బరితెగించి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఒక ఆదివాసి మహిళకు ద్రోహం చేసేలా వ్యవహరిస్తున్నారని.. నాపై కుట్రకు పాల్పడుతున్నవారికి బుద్ధి చెబుతానన్నారు.

New Update
Andhra Pradesh : వివాహేతర సంబంధం.. స్పందించిన ఎంపీ విజయసాయిరెడ్డి

YCP MP Vijaysai Reddy : వైసీపీ (YCP) ఎంపీ విజయసాయిరెడ్డికి వివాహేతర సంబంధం (Extramarital Affair) ఉన్నట్లు ఆరోపణలు రావడం ఏపీలో దుమారం రేపుతోంది. ఆయనకు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కే.శాంతి (K. Shanthi) కీ మధ్య వివాహేతర సంబంధం ఉందనీ.. తాను అమెరికాలో ఉన్నప్పుడు ఆమె గర్భం దాల్చిందనీ ఆమె మాజీ భర్త మదన్ మోహన్ ఆరోపణలు చేశారు. ఇందుకు కారణం విజయసాయిరెడ్డే అని అన్నారు. ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ డిమాండ్ చేశారు. మదన్ మోహన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. ఆదివారం దీనిపై అసిస్టెంట్ కమిషనర్ శాంతి స్పందిచారు. తనకు తండ్రి లాంటి విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటగట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

Also read: వేల కోట్ల దొంగ బ్యాంక్ గ్యారంటీలు.. లక్షల కోట్ల ప్రాజెక్టులకు గ్రహణం!

అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijaysai Reddy) ఈ వ్యవహారంపై స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ' కొత్త ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడుతోంది. ప్లాన్ ప్రకారమే నాపై కొందరు బరితెగించి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నేతలపై బురద జల్లెందుకు ప్రయత్నిస్తున్నారు. నన్ను భయపెట్టాలని చూసినా ఎవరికీ భయపడను. మా పార్టీలో కూడా కొందరు నాపై ఆరోపణలు చేస్తున్నారు. నా ప్రతిష్ఠను దిగజార్చేవారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. ఒక ఆదివాసి మహిళకు ద్రోహం చేసేలా వ్యవగరిస్తున్నారు. నాపై కుట్రకు పాల్పడుతున్నవారికి బుద్ధి చెబుతాను. దీనిపై పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెడతానని' అన్నారు.

Also Read: వైసీపీ నుంచి బాలినేని జంపింగ్‌ జంపాంగా..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు