Lok Sabha Elections : ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
TG: లోక్ సభ ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న తెలంగాణలో జరిగే లోక్సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల పోలింగ్ సమయాన్ని గంట పెంచింది. ఉదయం 7 గంటల నుంచి 6 గంటలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొంది.