/rtv/media/media_files/2025/02/19/MQKEe96FvU5t59DsSST7.jpg)
Gyanesh Kumar chief election commissioner
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం(election-commission-of-india) ఈరోజు ప్రకటించింది. దీనికి ముందు, భారత ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి17 ప్రధాన మార్పులు చేసింది. బీహార్ అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22తో ముగుస్తుందని, అంతకు ముందే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అమలు చేయబోయే 17 కొత్త కార్యక్రమాలు బీహార్‌కే కాకుండా మొత్తం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తాయని కుమార్ అన్నారు. బీహార్ ఎన్నికలను ఛత్ పండుగ లాగా, ప్రజాస్వామ్యానికి గొప్ప పండుగగా జరుపుకుంటామని జ్ఞానేష్ కుమార్ అన్నారు.
#Bihar First Initiatives - #Training#BiharElections2025pic.twitter.com/N6FnzHbM8C
— Election Commission of India (@ECISVEEP) October 6, 2025
Also Read : నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. షెడ్యూల్ విడుదల!
ఎన్నికల కమిషన్ తాజాగా తీసుకున్న సంచలన నిర్ణయాలు ...
పోలింగ్లో 17 మార్పులు.. బీహార్ ఎన్నికల నుండి స్టార్ట్
1. ఓటరుగా రిజిస్టరైన 15 రోజుల్లో ఓటర్ కార్డు డెలివరీ
2. పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు
3. ప్రతి బూత్‌లో ఓటర్ల సంఖ్య 1500 నుంచి 1200కు తగ్గింపు
4. EVMలపై అభ్యర్థి కలర్ ఫొటో, పెద్ద సైజులో అక్షరాలు
5. బూత్ అధికారి అధికారిక ID కార్డుతో ఉంటారు
6. ప్రతి బూత్ లో 100% వెబ్ కాస్టింగ్
7. బూత్ లెవల్ ఏజెంట్లు అందరికీ ట్రైనింగ్
8. బూత్ ఓట్ల లెక్కింపులో తేడాలుంటే అక్కడి VVPATలు కూడా లెక్కిస్తారు
9. BLO, BLO సూపర్‌వైజర్లకి ట్రైనింగ్
10. శాంతి భద్రతల నిర్వహణపై పోలీసులకు సెషన్స్
11. అక్రమ ఓటర్లను తొలగించేలా SIR
12. పోలింగ్ సిబ్బందికి రెమ్యూనరేషన్ పెంపు
13. పోలింగ్ స్టేషన్ సులువుగా గుర్తించేలా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ రీడిజైనింగ్
14. ECIకి గల 40 వేర్వేరు ప్లాట్ ఫాంలను ECINET అనే సింగిల్ డెస్టినేషన్ గా మార్పు
15. బూత్ ల నుంచి అభ్యర్థుల తరఫు వారి టేబుల్స్ దూరం 200మీ. నుంచి 100మీ.కి తగ్గింపు
16. ఎన్నికల తర్వాత ఎంతమంది ఓటేశారు, వారిలో పురుషులు, మహిళలు, ఇతరులు ఎందరో తెలుసుకునేలా సైట్లో డిజిటల్ ఇండెక్స్ అందుబాటులో ఉంచుతుంది.
17. ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యేది. ఇకపై EVMలతో లెక్కింపు మొదలుపెడతారు. EVMల చివరి రెండు రౌండ్ల కౌంటింగ్ కు ముందు పోస్టల్ ఓట్లు లెక్కిస్తారు...
కలర్ ఫోటో పెడుతున్నాం, పిలిస్తే పలుకుతాం!
బీహార్ ఎన్నికల్లో మొదటి సారి అభ్యర్థుల కలర్ ఫోటోలు పెడుతున్నామని ఈసీ ప్రకటించింది. మొత్తంగా 17 కొత్త సంస్కరణలు ఈ ఎన్నికల్లో తెస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల నిర్వహణలో లోపాలు, అవకతవకల నివారణకు చాలా అలర్డ్ గా ఉంటామని, పిలిస్తే పలుకుతామని కమిషన్ ప్రకటించింది. యాప్ డౌన్ లోడ్ చేసుకోవటం ద్వారా, లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ కు 1950 ఎన్నికల ఫిర్యాదులను చేయవచ్చని తెలిపింది. ఎన్నికల పరిశీలకులు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తారని ఈసీ ప్రకటించింది.