/rtv/media/media_files/2025/02/17/q07l9VT8yrbVUM2NJhOm.jpg)
Election Commission
దేశంలో గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) జలక్ ఇచ్చింది. ఎలాంటి కార్యకలపాలు నిర్వహించని రాజకీయ పార్టీలపై వేటు వేసింది. ఎన్నికల సంఘం వద్ద ఉన్న రాజకీయ పార్టీల జాబితాను సవరించింది. గుర్తింపునకు నోచుకోని 334 రాజకీయ పార్టీలను ఈసీ జాబితా నుంచి తొలగించింది. 2019 నుంచి ఆ పార్టీలు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదని వివరించింది. ఈ సీ నిబంధనల ప్రకారం.. ఈసీ వద్ద నమోదైన రాజకీయ పార్టీలు ఆరేళ్ల కాలంలో కనీసం ఒక్క ఎన్నికలోనైనా పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ గుర్తింపు లేని పార్టీలు 2019 నుంచి ఒక్క ఎన్నికలోనూ బరిలోకి దిగకపోవడంతో వాటిపై ఈసీ వేటు వేసినట్లు తెలిపింది.
ఈసీ వేటు వేసిన 334 రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవిగా పేర్కొంది. ఈ పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పేరుకు పార్టీలు పెట్టినప్పటికీ.. వీటికి భౌతికంగా ఎలాంటి కార్యాలయాలు కానీ, కార్యకలపాలు కానీ అందుబాటులో లేవని వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,854 గుర్తింపు పొందని పార్టీలు ఈసీ వద్ద రిజిస్టర్ అయి ఉన్నట్లు తెలిపింది. తాజా చర్యతో ఆ సంఖ్య 2,520కి తగ్గింది. ఎన్నికల సంఘం వద్ద ఉన్న సమాచారం ప్రకారం. ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయి. 67 ప్రాంతీయ రాజకీయ పార్టీలు మనుగడలో ఉన్నాయి. ఎన్నికల సంఘం డీలిస్ట్ చేసిన రాజకీయ పార్టీల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 18 పార్టీలు ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 5, తెలంగాణ నుంచి 13 పార్టీలు ఉన్నాయి.
Also Read : ఢిల్లీలో గోడకూలి ఏడుగురు మృతి, మృతుల్లో ఇద్దరు చిన్నారులు
EC Bans 334 Political Parties
దేశంలోని రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఆరేళ్ల కాలంలో కనీసం ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయని, క్రియారహితంగా ఉన్న 334 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ శనివారం అధికారికంగా ప్రకటించింది. కేవలం కాగితాలకే పరిమితమైన ఈ పార్టీలపై వేటు వేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, రిజిస్టర్ అయిన పార్టీలు క్రమం తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే, 2019 నుంచి ఇప్పటివరకు ఈ 334 పార్టీలు ఏ ఎన్నికలోనూ తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. అంతేకాకుండా, ఈ పార్టీలు ఈసీ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన చిరునామాలలో ఆ పార్టీలకు చెందిన కార్యాలయాలు భౌతికంగా లేవని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందని ఈసీ వివరించింది. ఈ రెండు కీలక నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకే వాటి గుర్తింపును రద్దు చేసినట్లు వివరించింది.
అయితే, ఈ వేటు కేవలం గుర్తింపు లేని, క్రియారహితంగా ఉన్న పార్టీలకు మాత్రమే వర్తిస్తుందని ఈసీ తెలిపింది. ప్రస్తుతం దేశంలో చురుకుగా ఉన్న 6 జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర స్థాయి పార్టీల కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవస్థలో జవాబుదారీతనం పెంచుతాయని ఈసీ వివరించింది. భవిష్యత్తులోనూ తొలగింపు చర్యలు కొనసాగుతాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఇక ఎన్నికల సంఘం గుర్తించిన ఆరు జాతీయ పార్టీలలో భారతీయ జనతా పార్టీ (BJP), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) (CPM), బహుజన్ సమాజ్ పార్టీ (BSP), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)లు ఉన్నాయి.
Also Read : ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. తవ్వకాల్లో దొరకని ఆస్తికలు.. ఎంత తవ్వుతున్న మట్టే!
banned | political-parties | latest-telugu-news | telugu-news | national news in Telugu