Earthquakes Today: 30 నిమిషాల్లో రెండు భూకంపాలు.. గజగజ వణికిపోయిన ప్రజలు!
మణిపూర్‌లో 30నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. చురచంద్‌పూర్‌లో రిక్టర్ స్కేలుపై 5.2తీవ్రత నమోదు అయింది. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే నోనీలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 2.5 తీవ్రత నమోదైంది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం గురించి సమాచారం రాలేదు.