BREAKING: హిమాచల్ ప్రదేశ్‌లో గంటలోనే రెండు భారీ భూకంపాలు.. భయంతో పరుగులు

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఒకే రోజు రెండు సార్లు భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలను భయాందోళనలకు గురై ఇళ్లలోంచి పరుగులు తీశారు. ఈ భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3, 3.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది.

New Update
Two earthquakes

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఒకే రోజు రెండు సార్లు భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలను భయాందోళనలకు గురై ఇళ్లలోంచి పరుగులు తీశారు. ఈ భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3, 3.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. అయితే, ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.

బుధవారం తెల్లవారు జామున 3.27 గంటలకుచంబా జిల్లాలో 32.87 N అక్షాంశం, 76.09 E రేఖాంశం వద్ద 20 కిలోమీటర్ల లోతులో 3.3 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించింది. 

మరోవైపు, రెండవ భూకంపం రిక్టర్ స్కేలుపై 4గా నమోదైంది. 32.71 N అక్షాంశం, 76.11 E రేఖాంశం వద్ద 10 కిలోమీటర్ల లోతులో ఉదయం 4.39 గంటలకు భూమి కంపించింది.  ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఈ జంట భూకంపాల వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూకంపాల తర్వాత అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లా భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. గతంలో కూడా ఈ ప్రాంతంలో అనేకసార్లు భూకంపాలు సంభవించాయి. హిమాలయాల ప్రాంతం టెక్టోనిక్ ప్లేట్ల కదలికలకు కేంద్రంగా ఉండటంతో ఇక్కడ భూకంపాలు సాధారణమేనని నిపుణులు చెబుతున్నారు.

ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తగా ఉండాలని, అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని అధికారులు సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈ భూకంపాల వల్ల ఎలాంటి నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు