/rtv/media/media_files/2025/03/30/ftkebbzOcNbT579nuVHC.jpg)
earthquake
Earthquakes : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మరోసారి భూ ప్రకంపనలతో ఉలిక్కిపడింది.. ఒంగోలులో అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రాత్రి 2 గంటల సమయంలో 2 సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు.. ఒంగోలులోని సీఎస్ఆర్ శర్మ కాలేజీ ప్రాంతంలో రాత్రి 2 గంటల ప్రాంతంలో భూమి అత్యధికంగా కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు.. అయితే, రాత్రి సమయం కావటంతో స్థానికులు గుర్తించేలోపే భూ ప్రకంపనల తీవ్రత తగ్గినట్టుగా తెలుస్తోంది.. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు.. స్థానిక ప్రజల నుంచి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.. కాగా, ప్రకాశం జిల్లాలో గతంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ ఏడాది మే నెలలో ఓసారి.. గత ఏడాది డిసెంబర్‌లోనూ ఓసారి ప్రకాశం జిల్లా ప్రజలను భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి.. అయితే, తాజాగా సంభవించిన భూప్రకంపనలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
ఇది కూడా చూడండి: Thaman OG: ఇది కదా మాస్ అంటే.. కొణిదెల తమన్ అస్సలు తగ్గడం లేదుగా..!
ఈ ఏడాది మే నెలలోనూ ఏపీలోని ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. పొదిలి, దర్శి, మండ్లమూరు మండలాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఆ సమయంలో పలువురు స్థానిక ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు దర్శి నియోజకవర్గంలో గత ఏడాది డిసెంబర్ నెలలో వరుసగా నాలుగు రోజులపాటు భూమి కంపించింది. గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో భూగర్భంలో మార్పులు కారణంగా భూమి కంపించినట్లు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, భూగర్భంలో చిన్నచిన్న కదలికలు వచ్చిన సమయంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని గతంలో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఇది కూడా చూడండి: Weekend OTT List: వీకెండ్ స్పెషల్.. ఓటీటీ మూవీస్ లిస్ట్ ఇదే..!