/rtv/media/media_files/2025/02/18/3p3oHWTO8Ox86FOwvz1J.jpg)
earthquake with sound Photograph: (earthquake with sound )
Delhi Earthquake: భూకంపం సంభవించినప్పుడు శబ్ధాలు రావడం అరుదు. భూమి ప్రకంపనలకు గురవడంతోపాటు పెద్ద పెద్ద శబ్ధాలు ఎందుకు వస్తాయో మీకు తెలుసా? ఢిల్లీలో సోమవారం ఉదయాన్నే 5గంటలకు పెద్ద శబ్ధంతో భూకంపం సంభవించింది. అదే సమయంలో బూమ్ అనే పెద్ద శబ్ధం కూడా వచ్చింది. ఆ భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. భూఉపరితలానికి 5 కిలో మీటర్ల లోతులో ఈ భూకంపం పుట్టింది. అయితే పెద్ద ఎత్తున ఆ శబ్ధం మాత్రం ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. దీంతో ఢిల్లీవాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. శాస్త్రవేత్తలు ఆ శబ్ధానికి గల కారణాలు వివరించారు. ఢిల్లీ ఎర్త్‌కేక్ సమయంలో సంభవించిన పెద్ద శబ్ధానికి సైంటిఫిక్ రీజన్స్ చెప్పుకొచ్చారు.
Also Read: Thandel Viral video: 'తండేల్' థియేటర్లో సాయిపల్లవి స్టెప్పులేస్తూ కుర్రోళ్లు రచ్చ రచ్చ ..!
#earthquake with sound recorded in my camera. See how curtains shaking.
— CA Manish Malhotra (@camalhotra) February 17, 2025
Hope everyone is safe. pic.twitter.com/WK6rcQsOmH
Also Read: దారిలో మొసళ్లు, పాములు.. అక్రమంగా అమెరికా ఇలా వెళ్లాను.. పంజాబ్ వ్యక్తి కన్నీటి కథ!
పెద్ద శబ్ధానికి సైంటిఫిక్ రీజన్..
తక్కువ లోతులో ఉండే భూకంప కేంద్రం ఏర్పడినప్పుడు ప్రకంపన సమయంలో ఈ బూమింగ్ శబ్దాలు వినిపిస్తుంటాయని అమెరికా జియోలాజికల్ సర్వే నిపుణులు తెలిపారు. అంటే భూఉపరితలం నుంచి భూకంప కేంద్రం తక్కువ లోతులో ఉంటే ఇలాంటి శబ్ధాలు వస్తాయి. భూమిపై ప్రకంపనలు రావడంతోపాటు స్వల్ప కాలం వచ్చిన భూతరంగాలు గాల్లో కలిసి ధ్వని తరంగాలుగా మారతాయని వివరించారు. అధిక ఫ్రీక్వెన్సీ కంపనాల కారణంగా బూమ్ అనే శబ్దం వస్తుందని చెప్పారు. కొన్నిసార్లు కంపనాలు జరక్కపోయినా.. ఈ భారీ శబ్దాలు వచ్చే అవకాశం ఉందన్నారు. భూకంప కేంద్రం లోతు ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా బూమ్ అనే శబ్దాలు వినిపిస్తాయని చెప్పారు.
Also Read: మలైకా అరోరాకి ఇష్టమైన జ్యూస్ ఇదే.. అది ఎలా తయారు చేయాలో తెలుసా..
Also Read: విశాఖలో లారీ భీభత్సము.. పార్కులోకి దూసుకెళ్లడంతో..